అందరిముందు సరసాలు మొదలు పెట్టిన లోబో.. చూడలేక చావాలంటు పరువు తీసిన సుమ!

సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో లో పాల్గొని సెలబ్రెటీలతో సుమా చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ షో కి గెస్ట్ గా వచ్చిన సెలబ్రిటీలను సుమ వెరైటీ టాస్కులు ఇచ్చి ఒక ఆట ఆడుకుంటుంది. ఈ షోకి వచ్చిన కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సుమని ఒక ఆట ఆడుకుంటారు. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ ఎపిసోడ్ లో విశ్వ , లోబో, బుల్లితెర నటీమణులు ఉమాదేవి, సింధూర పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్గా వెళ్లిన కార్తీకదీపం సేమ్ ఉమాదేవి లోబో మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు విసుగు చెందు వారిని హౌస్ నుండి బయటకు పంపించేశారు. బిగ్ బాస్ హౌస్ లో భంగు, భంగు అంటూ ఉమాదేవి లోబోతో చేసిన రొమాన్స్ కి ఆమె నెగిటివిటీ మూటకట్టుకొని బయటికీ వెళ్ళింది. వీరి ప్రవర్తన చూసి నాగార్జున సైతం విసుగు చెంది వారి మీద సీరియస్ అయ్యాడు.

ఇలా బిగ్ బాస్ హౌజ్ లో ఘాటు రొమాన్స్ చేసిన ఈ జంట ఈవారం ప్రసారం కాబోతున్న క్యాష్ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. ఈ షో లో వీరిద్దరూ వచ్చి రావటంతోనే అందరిముందు రొమాన్స్ మొదలు పెట్టారు. దీంతో విసిగిపోయిన సుమ ఈ షో మోత్తం వీళ్ళ రొమాన్స్ చూడలేక చావాలి అంటూ సెటైర్ వేసింది. అయినా కూడా ఇద్దరు ఏ మాత్రం తగ్గకుండా రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.