బట్టర్ ఇంగ్లీష్ అంటూ శృతి అంకిత మధ్య గొడవ పెట్టిన లాస్య…. దివ్య పై సీరియస్ అయిన తులసి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే….అమెరికన్ ప్రాజెక్ట్ తులసి చేతిలో సామ్రాట్ పెట్టడంతో ఆమె ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక బుక్ స్టోర్ దగ్గరకు వెళ్లి వారం రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాన్ని కొంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని పరంధామయ్య చూడటంతో అమెరికన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెబుతుంది.ఆ మాటలు విన్న శృతి నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను అని చెప్పడంతో వెంటనే అంకిత అక్కడికి వస్తుంది.

అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి ప్రైవేట్ గవర్నమెంట్లో చదివిన నేను నేర్పిస్తాను అని అంకిత చెప్పడంతో వీరి మాటలు విన్నలాస్య అంటే శృతిని బటర్ ఇంగ్లీష్ అంటావా అంటూ ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. లాస్య అలా అనేసరీకి శృతి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక లాస్య ఇద్దరు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిందని తెలుసుకున్న తులసి అంకిత ఇద్దరు శృతి వద్దకు వెళ్తారు మనిద్దరం ఒకే కడుపున పుట్టకపోయినా నిన్ను సొంత చెల్లెలా చూసుకున్న అలాంటిది నిన్ను ఎందుకు బాధ పెడతానని అంకిత శృతికి సారి చెబుతుంది.

అంతలోపే ప్రేమ్ అక్కడకు శృతి కోసం ఐస్ క్రీమ్ తీసుకువస్తాడు.ఇక తమ ఎదురగ శ్రుతికి ఐస్క్రీం తినిపించాలని పట్టుబట్టడంతో ఐస్ క్రీమ్ ఓపెన్ చేయగా అది మొత్తం లస్సి లాగా కరిగిపోయి ఉంటుంది దీంతో అక్కడున్న వారందరూ నవ్వుతారు.ఇక మరోవైపు లాస్య పరంధామయ్యకు తులసికి కాఫీ తీసుకురాగా పరంధమయ్య మాత్రం తన కాఫీ తాగానని మొండి చేస్తారు. ఇక చేసేదేమీ లేక తాగి బాగుందని పైకి చెబుతాడు.మరోవైపు తులసి పూజ చేసే హారతి తీసుకురాగా అందరూ హారతి తీసుకుంటారు. నందు హారతి తీసుకోబోతుండడంతో భార్య పూజ చేస్తేనే హారతి తీసుకోవాలని చెబుతుంది. ఇక నందు బయటకు వెళ్ళగా ఎక్కడికి అని అడిగిన లాస్య తనకు ఎదురు వస్తుంది.

అదే సమయంలో దివ్య తనకు ఎగ్జామ్స్ ఉన్నాయని తన లాప్టాప్ మొత్తం పూర్తిగా పాడైపోయిందని చెబుతుంది. తనకు వెంటనే లాప్టాప్ కావాలి అమ్మ అని అడగడంతో తులసి ఇప్పటికిప్పుడు లాప్టాప్ అంటే ఎక్కడ నుంచి వస్తుంది కాస్త ఓపిక పట్టమని చెప్పినప్పటికీ దివ్య మాత్రం తనకు లాప్టాప్ కావాలని సామ్రాట్ అంకుల్ని అడుగుతాను అని చెప్పడంతో వెంటనే తులసి మన స్వార్థం కోసం ఫ్రెండ్షిప్ ని ఉపయోగించకూడదు అంటూ తనని తిట్టి హడావిడిగా ఆఫీసుకు వెళ్తుంది. ఇదే అదనుగా భావించిన లాస్య దివ్యను మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.