కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… తులసి కట్టిన ముడుపును సామ్రాట్ విప్పి చూస్తారు అందులో తన చిన్ననాటి ఇంటికి వెళ్లి అక్కడ తన జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని ఉంది అంటూ ముడుపు కట్టి ఉంటుంది.ఇలా సామ్రాట్ ముడుపు విప్పి చూడటం పూజారి చూసి ఆ ముడుపు దేవుడి వద్దకు వెళ్లకుండానే నువ్వే విప్పి చూసావు కనుక ఆమె కోరిక తీర్చే బాధ్యత నీదే అని పూజారి చెబుతాడు. దీంతో సామ్రాట్ సరేనని చెబుతాడు.
ఇకపోతే సామ్రాట్ కార్లో వెళ్తూ మనం ప్రాజెక్ట్ పనిపై ఒక గ్రామానికి వెళ్లాలి అనగా వెంటనే సామ్రాట్ నోరు జారి తర్వాత ఏదో కవర్ చేసుకుంటాడు.పరంధామయ్య నందు అనసూయ మాట్లాడుకుంటూ ఉండగా అంతలోనే ప్రేమ్ కోసం ఆర్డర్ చేస్తున్న ఫుడ్ వస్తుంది. దీంతో ఎప్పుడూ లేనిది ఇలా ఫుడ్ ఆర్డర్ చేశారేంటి అని అనుకుంటూ ఉండగా అంతలో లాస్య వచ్చి వంట పూర్తి అయిన శృతి ప్రేమ్ కోసం ఫ్రైడ్ రైస్ చేస్తుంటే అడ్డుకున్నాను. అందుకే ఇలా ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటారు అంటూ సారీ చెబుతుంది. దీంతో నందు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి అంటూ శృతికి చెబుతాడు. దీంతో శృతి బాధపడుతూ ఉండగా ఈ విషయం ప్రేమ్ కి చెప్పొద్దు అంటూ అనసూయ పరందామయ్య చెబుతారు.
ఇక సామ్రాట్ ఇంటికి వెళ్లేసరికి హని దిగాలుగా కూర్చుంటుంది తనని ఎలా కూల్ చేయాలని సామ్రాట్ ఆలోచిస్తూ ఉండగా హనీ మాత్రం తనని ఆట పట్టిస్తూ చివరికి తనకు ఫస్ట్ ర్యాంక్ కు వచ్చిందని చెప్పడంతో సామ్రాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక వెంటనే ఈ విషయాన్ని తులసికి చెప్పడంతో తులసి కూడా సంతోషిస్తుంది. పరంధామయ్య ఆకలితో అలమటిస్తూ ఉండగా అంతలోపు అనసూయమ్మ తనకు భోజనం తీసుకువచ్చిస్తుంది. పరంధామయ్య తినబోతూ ఉండగా వెంటనే లాస్య వచ్చి తన ప్లేట్ లాక్కుంటుంది మామయ్య గారికిఅల్సర్ ఉంది తినకపోతే కడుపులో మంట వస్తుందని చెప్పడంతో ఈ మసాలా ఫుడ్ తింటే మంట కాదు కదా పైకి పోతారనీ తన ఫుడ్ మొత్తం లాక్కుంటుంది.
అల్సర్ రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ కాదు ఫ్రూట్స్ తినండి ఖర్చు కూడా తగ్గుతుంది అని చెబుతుంది. ఇక అనసూయమ్మని తనకోసం వంటలు చేసి పెడితే ఒళ్ళు అయినా తగ్గుతుంది కదా అంటూ లేనిపోని మాటలు అంటుంది దీంతో అనసూయ పరంగా దంపతులు బాధపడి వారి ఆకలి తీర్చుకోవడానికి మంచి నీళ్లు తాగుతారు ఇక ఈ విషయం తులసికినందుకు తెలియకూడదని బాధపడతారు. మరో ఎపిసోడ్ లో భాగంగా సామ్రాట్ తులసి చిన్నప్పటి ఊరికి తీసుకెళ్లి తనకు సర్ప్రైజ్ ఇస్తాడు.