తులసిలా మారాలని నిర్ణయించుకున్న లాస్య…. తులసి రాకతో సంతోషంలో కుటుంబ సభ్యులు!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…నందు నీళ్లు తాగుతుండగా తులసి అక్కడికి వెళ్లి నందు నేను తులసి మాదిరిగా ఉత్తమ ఇల్లాలు కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది. దీంతో ఒక్కసారిగా నందు పొలమారుతాడు. అప్పుడు లాస్య ఏంటి నందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా అనడంతో ఉన్నఫలంగా ఈ మార్పు ఏంటి ఈజీ కాదనీ నందు చెబుతాడు.అర్జెంటుగా షార్ట్ కట్ లో నేను ఉత్తమ ఇల్లాలు కావాలంటే ఏం చేయాలో చెప్పమని నన్ను సలహా అడగడంతో ఆయన ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు ఏం చేయాలో చెబుతాడు.

తులసి మాదిరి కావాలంటే తులసి లాగా మారిపోవాలని చెబుతున్నారు అంతే కదా అనడంతో నందు అవునని చెబుతాడు ఇక ఈమె తులసి లాగే చీర కట్టుకొని తనకు తానే జడ్జిమెంట్ ఇస్తుంది అంతలోపే తులసి అందరిని భోజనానికి రమ్మని పిలవగా అదేంటి నేను కదా అందరికీ భోజనం వడ్డించి అందరిని తన మాయలో వేసుకోవాలని చెప్పి కిందికి వెళ్తుంది తులసిని కూడా అక్కడ కూర్చోబెట్టి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అదే సమయంలో లాస్య నందు చేతి పై సాంబార్ పోయడంతో తను గట్టిగా చక్కటి నుంచి లేచి వెళ్ళిపోతాడు అదేంటి నందు అప్పుడే లేచావు అనడంతో లేచి వెళ్ళిపోకుండా ఉండడానికి నువ్వు నాపై పన్నీరు కాదు చల్లింది సాంబార్ అంటూ అక్కడి నుంచి వెళ్తాడు.

 

మరోవైపు సామ్రాట్ తులసి ఇద్దరు పని చేసుకుంటూ ఉండగా తులసి ఒక్కసారిగా నందుల మధ్య జరిగిన ఈ సంఘటన తెలుసుకొని నవ్వుతుంది దాంతో సామ్రాట్ ఏమైంది తులసిగారు. అలా నవ్వుతున్నారు అనడంతో ఆమె జరిగినది మొత్తం చెప్పగా సామ్రాట్ కూడా నవ్వుకుంటాడు.అప్పుడు తులసి ఆలోచిస్తే తన పిల్లలందరినీ ప్రొఫెషనల్ గా ఏదో ఒకచోట బిజీ చేయాలి అలాగే అత్తయ్య మావయ్యలను బాగా చూసుకోవాలని మాట్లాడతారు. ఇంకా మీకు ఎలాంటి లక్ష్యాలు లేవా అని సామ్రాట్ అడగగా దివ్య పెళ్లి చేయాలని తులసి చెబుతుంది దాంతో త్వరలోనే మనకు అమెరికన్ ప్రాజెక్టు రాబోతుంది దానికి మిమ్మల్ని ఇన్చార్జిగా చేస్తున్నాను అని చెప్పడంతో తులసి అదేంటి సామ్రాట్ గారు నాకు ఇంగ్లీష్ రాదు కదా నేను ఈ ప్రాజెక్టు తీసుకోనని చెబుతుంది.

ఈ ప్రాజెక్టు మీరే చేయాలి అని సామ్రాట్ చెప్పినప్పటికీ తులసి వినదు. మీరు ఇంగ్లీషు నేర్చుకోవడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది ఇది నా ఆర్డర్ అని చెప్పి సామ్రాట్ అక్కడ నుంచి వెళ్తాడు. చేసేదేమీ లేక తులసి ఆ ప్రాజెక్టుకు ఇంచార్జిగా ఉంటుంది.అయితే తాను అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని కంగారుపడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని పుస్తకం కొనడానికి వెళ్తుంది. మరోవైపులాస్య అందరిదీ తన మాయలో వేసుకోవడం కోసం పనులు చేస్తూ ఉంటుంది.