బిగ్ బాస్ హౌస్ లో కర్వా చౌత్ చేసుకున్న రోహిత్ మెరీనా?

మనదేశంలో ప్రతి పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలో కొన్ని పండుగలు పెద్ద ఎత్తున ప్రాముఖ్యతను సంతరించుకోగా ఉత్తర భారత దేశంలో మరికొన్ని పండుగలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా ఉత్తర భారతీయులు పెళ్లైన మహిళలు పెళ్లి చేసుకోబోయే యువతలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగలలో కర్వా చౌత్ ఒకటి.ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఈ పండుగను సినిమా సెలబ్రిటీల నుంచి మొదలుకొని సాధారణ మహిళల వరకు తమ భర్త సుఖసంతోషాలతో క్షేమంగా ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ పండుగను బాలీవుడ్ సెలబ్రిటీలు భారీ స్థాయిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా పెళ్లైన మహిళ ఆరోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత తన భర్త మొహం చూసి అనంతరం ఏదైనా ఆహారాన్ని భుజిస్తారు.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి మెరీనా రోహిత్ దంపతులు కూడా ఉత్తర భారతీయులు కావడంతో వీరు స్పెషల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఈ పండుగను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే మెరీనా రోహిత్ దంపతులు కర్వా చౌత్ పండుగ సందర్భంగా సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెరీనా జల్లెడలో చంద్రుడిని చూసిన అనంతరం తన భర్త రోహిత్ ను చూసి తన పాదాలకు నమస్కారం చేసి తన ఆశీర్వాదం ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి మెరీనా రోహిత్ దంపతులు ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓ పాటను ప్లే చేయగా హౌస్ సభ్యులందరూ కలిసి ఎంతో సంతోషంతో చిందులు వేశారు.