ఎట్టకేలకు ఒకటైన కార్తీక్ కుటుంబం….. విషయం తెలిసి షాక్ లో మోనిత!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… దొంగ హిమ సౌర్యను వెనక్కి తోయడంతో వాళ్లు కింద పడబోతారు. ఆ సమయంలో కార్తీక్ వాళ్ళను కింద పడకుండా పట్టుకుంటారు. అయితే కార్తీక్ ని చూసిన పిల్లలు ఒక్కసారిగా ఎమోషనల్ అయి తనని హత్తుకొని ఏడ్చేస్తారు.ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు డాడీ మీకోసం మేము ఎంతగా వెతికామో తెలుసా అంటూ ఏడుస్తారు. నేను అమ్మానాన్నలను చూశానని చెప్తే నువ్వు వినలేదు కదా శౌర్య ఇప్పుడు చూసావా నాన్న వచ్చారు అని హిమా అంటుంది.

నువ్వు చెబితే అప్పుడు నమ్మలేదు కానీ ఇప్పుడు కూడా నాకు అనుమానం వస్తుంది. అమ్మానాన్నలు నన్ను చూసి కూడా నాకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నారేమో అని సందేహం వస్తుందని సౌర్య మాట్లాడుతుంది.ఇక పిల్లలు ఇద్దరు కార్తీక్ తో మాట్లాడుతూ అసలు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు యాక్సిడెంట్ లో చనిపోయారని మేము చాలా బాధపడ్డాము అసలు అమ్మ మా దగ్గరకు మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు అమ్మ ఎక్కడ నాన్న అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తారు.

ఈ విధంగా పిల్లలు ప్రశ్నలు అడిగేసరికి కార్తీక్ నేను అమ్మను తీసుకొని మీ ఇంటికి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పగా అసలు వదలము. వదిలితే నువ్వు మళ్ళీ తప్పించుకొని పారిపోతావు అంటూ పిల్లలు మాట్లాడటంతో చేసేదేమీ లేక కార్తీక్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా మరోవైపు దీప సౌందర్య ఇద్దరు వస్తుంటారు.సౌందర్య దీప చేతుని గట్టిగా పట్టుకుంటుంది ఎందుకు అత్తయ్య అంత గట్టిగా పట్టుకున్నారు. వదిలితే మరి ఎక్కడ పారిపోతానేమోనని భయపడుతున్నారా అనడంతో… ఇదంతా నాకు కలగానే ఉంది. ఈ విషయం మీ మామయ్యకు చెబుతాము అంటే నువ్వు చెప్పే ఈ సగం సగం సమాధానాలుకు ఆయన ఎక్కడ బాధపడతారు అని భయంగా ఉంది అంటూ సౌందర్య సమాధానం చెబుతుంది.

ఇలా దీప సౌందర్య కార్తీక్ హిమ సౌర్య అందరూ ఒకే చోట కలుసుకోవడంతో ఒక్కసారిగా పిల్లలు దీపను చూసి తనని హత్తుకొని ఏడుస్తారు. కార్తీక్ నుచూసి సౌందర్య కూడా ఎమోషనల్ అవుతుంది. ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారో నాకు తెలియాలి మమ్మల్ని చూసి కూడా మీరు దాక్కోవడానికి కారణం ఏంటి మీరు బతికి ఉండి కూడా పిల్లలను తల్లిదండ్రులు లేని వారిగా చూడాల్సిన కర్మ ఏంటి అంటూ ప్రశ్నిస్తుంది.దీంతో కార్తీక్ నువ్వు అనుకున్నది చేసావ్ ఎట్టకేలకు నన్ను పిల్లలను కలిపావు కదా అంటూ మనసులో అనుకుంటాడు.కార్తీక్ మాట్లాడుతూ నువ్వు పిల్లలని తీసుకెళ్ళమ్మ నేను దీప వచ్చి అంత వివరంగా చెబుతాము అని చెప్పడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నారా.. అసలు ప్రసక్తి లేదు ఇప్పుడే ఎందుకు మీరు మాకు దూరంగా ఉన్నారో చెప్పాలి అంటూ సౌందర్య నిలదీస్తుంది.

మరోవైపు మోనిత కార్తీక్ ఇంటికి వెళ్లడంతో తాళం వేసి ఉంటుంది అయినా వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. అయితే తనకు ఆకలిగా ఉండడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి దోస వేసుకొని తింటూ ఉంటుంది. కార్తీక్ ఇంటి వద్దకు సౌందర్య పిల్లలతో పాటు కలిసి వెళ్లి నేను ఉంటున్న ఇల్లు ఇక్కడే అమ్మ అని చెప్పడంతో నేను ఇంటికి వచ్చాను అని సౌందర్య చెబుతుంది. నువ్వు రావడం నేను చూశాను కనపడకుండా దాక్కున్నామని చెబుతారు. అయితే తాళం పగలగొట్టి ఉండటం చూసి లోపలికి వెళ్లడంతో అక్కడ మోనిత ఉంటుంది. మోనితను చూసిన సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అయితే కుటుంబం మొత్తం కలిసిపోవడంతో మోనిత కూడా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు నా కొడుకు కోడలు కనిపించకపోవడానికి నువ్వే కారణమా నీకు వీళ్ళు ఎక్కడున్నారో తెలిసి కూడా అబద్ధాలు చెప్పావా అంటూ సౌందర్య మోనిత పై సీరియస్ అవుతుంది.