మాధురి హాస్పిటల్ పాలు కావటానికి కన్నబాబు కారణమని జానకి తన కుటుంబ సభ్యులకు చెబుతుంది. అందువల్ల కన్నబాబుని పోలీసులు చేత అరెస్టు చేయించానని చెప్పగా మంచి పని చేశావు అంటూ జ్ఞానంబ జానకని మెచ్చుకుంటుంది. ఈ కేసు నుండి అఖిల్ బయటపడటంతో గోవిందరాజులు, జ్ఞానాంబ, జెస్సి ఎంతో ఆనందపడతారు. ఆ సమయంలో అఖిల్ ఫోన్ రావడంతో బయటికి వెళతాడు. అఖిల్ వెనక్కి జానకి కూడా బయటకి వెళుతుంది. అఖిల్ తన స్నేహితుడితో ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూడగానే జానకి ఎక్కడ ఉంటుంది. తన తప్పు లేదని నిరూపించినందుకు అఖిల్ జానకికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతుండగా జానకి అతనిని ఆపి మాధురి ఇలా కావటానికి పూర్తి కారణం నువ్వు కాకపోయినా కూడా ఇందులో నీ ప్రమేయం కూడా కొంతవరకు ఉంది అని చెబుతుంది.
ఆ తర్వాత రామ జానకి వద్దకు వచ్చి మీరు తన బాబుని అరెస్టు చేయించానని చెప్పారు. కానీ ఇందాక కన్నబాబు నాకు గుడి వద్ద కనిపించాడు అని చెబుతాడు. వాళ్ల పరుపతి అడ్డం పెట్టుకొని అఖిల్ ని ఈ కేసులో ఇరికించారు. తర్వాత కూడా అఖిల్ ని ఈ కేసులో ఇరికించారని నమ్మకం ఏంటి అని రామ చెప్పగానే జానకి కోపంతో కన్నబాబు ఇంటికి వెళుతుంది. అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని మీరు నిరూపించారు, న్యాయం నిజాయితీ ఉంటే ఎలాంటి వాళ్ళని అయిన ఎదిరించొచ్చు అని నేను నిరూపిస్తాను అంటూ తల్లీ కొడుకులకు జానకి వార్నింగ్ ఇస్తుంది. నా మరిది తప్పు చేస్తే నేను సరిదిద్దటానికి ప్రయత్నం చేశాను. అలాగే నీ కొడుకుని వెనకేసుకు రాకుండా అతన్ని సరైన దారిలో పెట్టు అని సునంద కు వార్నింగ్ ఇస్తుంది.
మాధురి హాస్పిటల్ బెడ్ పై ప్రాణాలతో పోరాటానికి కారణం నీ కొడుకు. నీ కొడుకు తప్పు చేశాడని సాక్షాధారాలతో నిరూపించాను. కానీ మీరు వాటిని డబ్బుతో కొనేశారు అని అంటుంది. దీంతో నీకు ఎంత కావాలో చెప్పు అని సునంద అనగానే.. నన్ను డబ్బుతో కొనలేరు అంటూ జానకి సమాధానం చెబుతుంది. యూనిఫామ్ వంటిమీద లేకపోయినా సాక్షాధారాలతో నీ కొడుకుని అరెస్ట్ చేయించగలిగాను. ఇక యూనిఫామ్ నా ఒంటిమీదకు చేరిందంటే తప్పు చేసిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను అని సీరియస్గా చెబుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అని కన్నబాబు అనగానే.. ఆ పని మీరు చేయకండి అని జానకి అంటుంది. మా ఆయనకు వార్నింగ్ ఇచ్చావట కదా అందుకే నేను వచ్చాను.. నా జోలికి , నా ఫ్యామిలీ జోలికి వస్తే నా రియాక్షన్ ని నువ్వు తట్టుకోలేవు. మర్యాదగా తప్పు ఒప్పుకొని సరెండర్ అవ్వు అని కన్నబాబుకి జానకి వార్నింగ్ ఇస్తుంది.