డబుల్ మీనింగ్ డైలాగులకి కేరాఫ్ అడ్రస్ గా మారిన జబర్దస్త్.. రోజురోజుకి దిగజారిపోతోందిగా!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో లో కామెడీ కన్నా బూతు మాటలే ఎక్కువగా ఉంటాయి. ప్రేక్షకులకు కూడా ఆ మాటలు బాగా నచ్చటంతో ఈ షో ని బాగా ఆదరిస్తున్నారు. జబర్థస్త్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకూ ఈ షో డబుల్ మీనింగ్ డైలాగులు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ షో లో ఆర్టిస్టులు చేసే వెకిలి చేస్టలు, మాట్లాడే మాట్లాడు అన్ని వెగటు పుట్టించేవిగా ఉంటాయి.

ఇక ఆది జబర్థస్త్ కి వచ్చిన తర్వాత ఇలాంటి మాటలతో మరింత రెచ్చిపోతున్నారు. ఆది తన టీమ్ లో ఉన్న రాజు, పరదేశి, దొరబాబు లాంటి వారి మీద డబుల్ మీనింగ్ వచ్చేలా పంచ్ లు వేస్తుంటాడు. జబర్థస్త్ లో ఉన్న అందరూ దాదాపూ ఇలాంటి మాటలతోనే కామెడీ చేస్తున్నారు. దీంతో చాలామంది ప్రేక్షకులు ఈ విషయంలో జబర్థస్త్ గురించి విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జబర్థస్త్ లో పొట్టి నరేశ్ కూడా ఇలాంటి డైలాగులు చెప్పాడు. తాను పొట్టిగా ఉన్నానని అందరూ ఎప్పుడూ చిన్నచూపు చూస్తుంటారు అని బాధపడేవాడు. కానీ ఇటీవల తనని తాను అవమనించుకునేలా కామెంట్లు చేసాడు.

నరేష్ మొన్నటి ఎపిసోడ్‌లో దొండకాయ అంటూ తన పరువు తానే తీసుకున్నాడు. దొండకాయ ఏంటి మరీ ఇంత చిన్నగా ఉందని నరేష్ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసాడు. దీంతో ఇంద్రజ ఆ మాటలు వినలేక తలదించుకుంది. ఇక ఈ వారం ప్రసారం కాబోయే జబర్థస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో కూడా నరేశ్ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో నరేష్ఒక స్కిట్ లో గునపం చేయలేని పనులు.. చిన్న బ్లేడ్ చేస్తుంది.. దానికి కూడా ఓ చాన్స్ ఇవ్వాలి అంటూ నరేష్ తన హైట్ గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. ఇప్పుడు వచ్చిన ఒక కొత్త అమ్మాయి కూడా నరేశ్ గురించి అదే డైలాగ్ వేసింది. దీంతో అమ్మాయిలు మారుతున్నారు కానీ డైలాగ్ మాత్రం మారడం లేదు అని అంటాడు. మొత్తనికి ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో జబర్థస్త్ ప్రేక్షకులని అకట్టుకోవటానికి బాగా ప్రయత్నాలు చేస్తోంది.