జబర్దస్త్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..? ఇకపై ఒక్కరోజు మాత్రమే..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి ప్రేక్షకులలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ప్రేక్షకులని అలరిస్తూ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. 2013లో మొదలైన జబర్దస్త్ షో ఇప్పటివరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఎంతోమంది కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే గత కొన్ని రోజులుగా జబర్దస్త్ పరిస్థితి తారుమారైనట్టు కనిపిస్తోంది. జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా మంచి పేరు తెచ్చుకున్న కొంతమంది టీం లీడర్స్ జబర్దస్త్ కి దూరమయ్యారు.

అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో జడ్జి లుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా గారు కూడా జబర్దస్త్ కి దూరమయ్యారు. అంతేకాకుండా ఇటీవల జబర్దస్త్ గురించి జబర్దస్త్ యాజమాన్యం గురించి కిర్రాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో జబర్దస్త్ షో మీద ప్రేక్షకులకు నెగిటివ్ ఒపీనియన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం జబర్దస్త్ లో పనిచేస్తున్న ఎంతోమంది ఆర్టిస్టులు ఆర్పి చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ జబర్దస్త్ గురించి నిజాలు బయట పెడుతున్నారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ప్రస్తుతం ప్రతి గురు, శుక్రవారాలలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా రెండు రోజులు ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఇకపై కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రసారం కానుందని సమాచారం ఈ విషయాన్ని ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ బయటపెట్టినట్టు తెలుస్తోంది. మొదట జబర్దస్త్ ప్రారంభమైనప్పుడు కేవలం గురువారం రోజు మాత్రమే ఈ షోని ప్రసారం చేసేవారు. అయితే ఈ కామెడీ షో కి ప్రేక్షకుల ఆదరణ పెరగటంతో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరొక రోజు కూడా ఈ కామెడీ షో ను ప్రసారం చేస్తున్నారు. 2015 నుండి ఇలా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని గురు, శుక్రవారాలలో వారాలలో ఈ కామెడీ షో ప్రేక్షకులను అలరిస్తోంది. కొన్ని రోజులుగా జబర్దస్త్ రేటింగ్స్ పడిపోవడంతో ఈ షో ని కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రసారం చేస్తూ మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్ ను ప్రేక్షకులకి అందించడానికి ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది.