Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కార్యక్రమాలలో జబర్దస్త్ కామెడీ షో ఒకటి దాదాపు దశబ్దన్నర కాలం పైగా ఈ కార్యక్రమం ప్రసారమవుతు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎంతోమందికి మంచి జీవితాన్ని కూడా అందించిందని చెప్పాలి. ఈ కార్యక్రమా ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని హీరోలుగాను, దర్శకులుగాను, కమెడియన్లుగాను కొనసాగుతున్నారు. అయితే జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఉన్నటువంటి కమెడియన్స్ అదిరే అభి, వేణు, సుడిగాలి సుదీర్, హైపర్ ఆది వంటి వారందరూ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదట్లో ఉన్నంత ఆదరణ ప్రస్తుతం లేదని చెప్పాలి. ఈ కార్యక్రమం రేటింగ్ కూడా పూర్తిగా పడిపోయింది. దీంతో ఈ కార్యక్రమం గురించి ఇటీవల కమెడియన్ నూకరాజుకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో ఆదరణ లేదు అందుకు కారణం సరైన కంటెంట్ లేకపోవడమేనా అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు నూకరాజు సమాధానం చెబుతూ.. జబర్దస్త్ కార్యక్రమం అప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
జబర్దస్త్ కార్యక్రమంలో ఎలాంటి మార్పులు లేదు మార్పు వచ్చింది చూసే ప్రేక్షకులలో మాత్రమే అంటూ నూకరాజు సమాధానం చెప్పారు. జనాలు బాగా అప్డేట్ అయ్యారు. సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ అంటూ ఎంతో అద్భుతమైన కామెడీలు చేస్తున్నారు. ఇలా అరగంట పాటు ఒక స్కిట్ చూసి నవ్వుకునే బదులు 30 నిమిషాలలోనే అంతే అద్భుతమైన కామెడీ రీల్స్ ద్వారా దొరుకుతున్న నేపథ్యంలో జబర్దస్త్ చూడటానికి పెద్దగా ప్రేక్షకులు ఇష్టపడటం లేదంటూ ఈ కార్యక్రమాన్ని రేటింగ్ తగ్గడానికి నూకరాజు అసలు కారణాన్ని తెలియజేశారు. తిరిగి ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఎన్నో మార్పులు చేసినట్టు కూడా ఈయన తెలియచేశారు.
