జబర్దస్త్ కు సింగర్ మనో శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్లేనా?

బుల్లితెరపై మల్లెమాలవారు నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.గత పది సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి ఈ మధ్యకాలంలో కాస్త రేటింగ్ తగ్గిందనే చెప్పాలి.అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారందరూ వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి ఆదరణ తగ్గింది.ఇక ఈ కార్యక్రమానికి జడ్జిలుగా కొనసాగుతున్నటువంటి రోజా నాగబాబు ఇద్దరు వెళ్లిపోవడంతో రోజా స్థానాన్ని ఇంద్రజ కైవసం చేసుకోగా నాగబాబు స్థానంలో సింగర్ మనో ఉండేవారు.

అయితే మనో సైతం ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడం లేదు ఈయన స్థానాన్ని ఎవరో ఒకరు సెలబ్రిటీలు హాజరవుతూ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. అయితే జబర్దస్త్ కార్యక్రమానికి సింగర్ మనో పూర్తిగా దూరమయ్యారని తెలుస్తుంది. ఇలా ఈయన దూరం కావడానికి రెమ్యూనరేషనే కారణమని సమాచారం.ఈయన ఈ కార్యక్రమం కోసం ప్రతి వారం చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంటుంది అలాగే హైదరాబాదులో బస చేయడం కోసం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు.

ఇలా ప్రతివారం చెన్నై నుంచి హైదరాబాద్ రావడమే కాకుండా హైదరాబాద్లో స్టే చేయడం కోసం భారీగా ఖర్చులు రావడం చేత జబర్దస్త్ వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ కన్నా ఈయనకే అధిక ఖర్చు అవుతుందని, ఇలా నష్టాలను బరిస్తూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం కన్నా పూర్తిగా ఈ కార్యక్రమానికి దూరం కావడమే మంచిదని మనో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ కార్యక్రమం నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.