టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. విభిన్నమైన కథాంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోగా నాగ్ కు గుర్తింపు ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త హీరోలను పరిచయం చేసిన హీరో ఎవరనే ప్రశ్నకు సైతం నాగార్జున పేరు సమాధానంగా వినిపిస్తోంది. నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
నాగార్జున హీరోగా మహేష్ భట్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో క్రిమినల్ సినిమా ఒకటనే సంగతి తెలిసింది. బాలీవుడ్ డైరెక్టర్ అయిన మహేష్ భట్ తెలుగులో డైరెక్షన్ చేసిన ఏకైక సినిమా క్రిమినల్ కావడం గమనార్హం. నాగార్జునకు కథ ఎంతో నచ్చి నటించిన సినిమాలలో క్రిమినల్ సినిమా ఒకటి కావడం గమనార్హం. క్రిమినల్ సినిమాలో నాగార్జున డాక్టర్ అజయ్ రోల్ లో నటించి మెప్పించారు.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్యుజుటివ్ అనే ఇంగ్లీష్ మూవీ నుంచి కాపీ కొట్టారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. క్రిమినల్ సినిమాలో నటించే సమయంలో మరో సినిమాలో నటించే అవకాశం ఉన్నా నాగ్ మాత్రం మరో సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఈ సినిమా కోసం నాగార్జున గడ్డం పెంచి తన లుక్ ను మార్చుకున్నారు. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.
ఈ సినిమాలోని తెలుసా మనసా సాంగ్ ను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు. ఈ సినిమా రీరికార్డింగ్ పనులు చెన్నైలో జరగగా నాగార్జున చెన్నైలో రీరికార్డింగ్ కు కూడా హాజరై ఆ పనులను దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో నాగార్జున హర్ట్ అయ్యారని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమాసినిమాకు నాగార్జునకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.