మిడిల్ ఏజ్ ఆంటీ అంటూ రష్మీని అవమానించిన ఇంద్రజ… తెల్ల మొహం వేసుకున్న రష్మి!

ప్రస్తుతం బుల్లి తెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రష్మీ ఎంతో బిజీగా గడుపుతున్నారు.తన అద్భుతమైన మాట తీరుతో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా జబర్దస్త్ కమెడియన్లు సైతం తనపై సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇలా అందరినీ నవ్విస్తూ ఎంతో సరదాగా రష్మీ ఈ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ ఎప్పటిలాగే తమ అద్భుతమైన పర్ఫామెన్స్ లతో అందరిని ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా రష్మీను ఇంద్రజ దారుణంగా అవమానపరిచారు. సుజాత తల్లి పాత్రలో ఒక లేడీ కమెడియన్ నటించారు.

ఇలా ఆ లేడీ కమెడియన్ ని చూసి రష్మీ ఏంటి మీరు సుజాత తల్లినా… వాళ్ల కన్నా మీరే చాలా యంగ్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేశారు.రష్మీ ఈ విధంగా కామెంట్ చేసేసరికి వెంటనే ఇంద్రజ స్పందిస్తూ ఎవరు ఏజ్ వారికి వాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు అంటూ పరోక్షంగా రశ్మిని మిడిల్ ఏజ్ ఆంటీ అంటూ ఈ సందర్భంగా రష్మీ వయసు గురించి ప్రస్తావిస్తూ ఆమెను దారుణంగా అవమానపరిచారు. ఈ విధంగా ఇంద్రజ రష్మి గురించి మాట్లాడటంతో రష్మీ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.