అనాధగా మిగిలిన జబర్థస్త్ కమెడియన్ కి మేమున్నాం అంటూ భరోసా ఇచ్చిన ఇంద్రజ..?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ప్రవీణ్ కూడా ఒకరు. మొదట ఈటీవీలో ప్రసారమవుతున్న పటాస్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రవీణ్ ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఇలా పటాస్ షో ద్వారా పాపులర్ అవడంతో మల్లెమాలవారు ప్రవీణ్ కి జబర్దస్త్ లో అవకాశం కల్పించారు. ఇక జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ టీం లో సందడి చేస్తున్న ప్రవీణ్ తన కామెడీ పంచులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.

గత కొన్ని రోజులుగా జబర్దస్త్ లో ప్రవీణ్ సందడి మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఇలా తెరపై కనిపిస్తూ అందరినీ నవ్వించే ప్రవీణ్ జీవితంలో కూడా ఎంతో బాధ ఉంది. ఇక ఇటీవల ప్రసారం కానున్న జబర్దస్త్ ప్రవీణ్ తన మనసులో ఉన్న బాధని అందరి ముందు బయటపెట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈవారం ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో సందడి చేసిన ప్రవీణ్ తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు. ఎన్నో ఏళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న ప్రవీణ్ ఇటీవల తండ్రిని కూడా పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయాడు.

ఈ క్రమంలో తన ఒంటరితనం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రవీణ్ బాగా చూసి అక్కడున్న తోటి కంటెస్టెంట్లతో పాటు యాంకర్ రష్మి జడ్జిలు మనో, ఇంద్రజ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రజ స్టేజ్ మీదకు వెళ్లి ప్రవీణ్ ని దగ్గరకు తీసుకొని ఓదార్చుతూ..నీకు మేమందరం ఉన్నాం నాన్న అంటూ గట్టిగా హత్తుకొని ఓదార్చింది. ఈవారం ప్రసారం కాబోతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ మొదట అందరి చేత నవ్వులు పూయించిన కూడా చివర్లో మాత్రం అందరిని కన్నీళ్లు పెట్టించింది.