Oh Bhama Ayyo Rama: టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుహాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాకుండా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు హీరో సుహాస్.
అందులో భాగంగానే ఇటీవల కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఉప్పు కప్పురంబు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. సినిమా ఓటీటీలో నేరుగా విడుదల అయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు సుహాస్ మరో కొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏది ఏంటి అన్న విషయానికి వస్తే.. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ఓ భామ అయ్యో రామా. రామ్ గోదల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అనిత హస్సానందాని, అలీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హరీశ్ నల్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు ఈసారి కూడా సుహాస్ హిట్ కొట్టడం ఖాయం అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభిస్తోంది.