క్యాష్ షో కోసం సుమ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

బుల్లితెర మహారాణిగా గుర్తింపు పొందిన సుమ కనకాల గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్లో యాంకర్ గా చలామణి అవుతున్న సుమ ఇప్పటికీ నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతోంది. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది. ప్రస్తుతం సుమ టీవీ షోస్ తో పాటు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చేస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో కి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఈటీవీలో ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న క్యాష్ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ ప్రతి వారం ప్రసారమయ్యే ఈ షోలో సుమా చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రతివారం సినిమా, సీరియల్ సెలబ్రెటీలను గెస్ట్ లుగా ఆహ్వానించి వారితో విచిత్రమైన టాస్కులు ఆడిస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. దీంతో ఈ షో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది.

ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ యాంకరింగ్ చేస్తున్న ఈ షో కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. క్యాష్ షో ఒక్క ఎపిసోడ్ కోసం సుమ దాదాపు 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమచారం. అంతే కాకుండా తన స్టాఫ్ ఖర్చుల కోసం మరొక రూ.50 వేలు అదనంగా అందుకుంటోంది. ఇలా క్యాష్ ఒక్క ఎపిసోడ్ కి సుమ అందుకునే రెమ్యునరేషన్ అక్షరాలా రు.5.50 లక్షలు. అయినా సుమ కి ఉన్న పాపులారిటీ కి ఈ రెమ్యునరేషన్ తక్కువనే చెప్పాలి.