జబర్దస్త్ ఆడిషన్స్ కోసం ఎంతమంది హజరయ్యారో తెలిస్తే జబర్థస్త్ కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో లో అవకాశం దక్కించుకున్న ఎంతోమంది కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుదీర్ , గెటప్ శ్రీను, హైపర్ ఆది, చంద్ర , అభి, చంటి వంటి ఎంతోమంది సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంటున్నారు. తాజాగా జబర్థస్త్ లో కొత్త ఆర్టిస్టుల కోసం అధికారికంగా ప్రకటన ఇచ్చింది.

దీంతో కొన్ని 100, 200 మంది దాకా ఈ ఆడిషన్స్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని మల్లెమాలవారు భావించారు. కానీ ఆడిషన్స్ కోసం హాజరైన వారిని చూసి మల్లెమాలవారు షాక్ అయ్యి తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. జబర్దస్త్ లో అవకాశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఆడిషన్స్ కోసం అధికారికంగా ప్రకటన ఇవ్వడంతో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు, సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు, సీరియల్ నటీనటులు.. ఇలా వారి టాలెంట్ నిరూపించుకునే అవకాశం కోసం జబర్దస్త్ ఆడిషన్స్ కి మొత్తం 3000 మంది హాజరైనట్లు సమాచారం. ఆడిషన్స్ కోసం ఇలా 3000 మంది హాజరు కావడంతో ప్రేక్షకుల్లో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది.

ఆడిషన్స్ కోసం ఒకేసారి ఇంత మంది హాజరుకావటంతో మల్లెమాలవారికి ఏం చేయాలో దిక్కు తోచక తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అదృష్టం కొద్ది జబర్దస్త్ లో అవకాశం దక్కించుకున్న వారు జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి సినిమాలలో అవకాశాలు రావటంతో జబర్దస్త్ కి దూరమయ్యారు. అయితే అలాంటివారు వెళ్ళిపోవటం వల్ల జబర్దస్త్ షో కి ఏ మాత్రం నష్టం రాలేదు. జబర్దస్త్ యాజమాన్యం వారు ఎంతోమంది టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ జబర్దస్త్ లో అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగిన ఆడిషన్స్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో తెలియాల్సి ఉంది.