హైపర్ ఆది వేసే పంచ్‌లు, చేసే స్కిట్‌ల గురించి, ప్రతీ వారం ఓ కొత్త ఆర్టిస్ట్‌ను గెస్ట్‌గా తీసుకొచ్చి అందర్నీ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీనియర్ ఆర్టిస్ట్‌లు, సీరియల్ నటీమణులను తీసుకొస్తాడు. గ్లామర్ టచ్ కోసం టిక్ టాక్ స్టార్‌ను కూడా తీసుకొస్తాడు. అలా ఈ సారి తీసుకొచ్చిన గెస్ట్‌ను చూసి హైపర్ ఆది తల పట్టుకున్నాడు. సీనియర్ ఆర్టిస్ట్ నట కుమారిని తీసుకొచ్చి స్కిట్ వేశాడు.
నటకుమారి డ్యాన్సులకు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇక ఈమెను ఎంట్రీతోనే హైపర్ ఆది అదిరిపోయే పంచ్ వేశాడు. మన్మథ రాజా మన్మథ రాజా అనే పాటకు మంచి ఊపుతో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం రష్మీ కౌంటర్ వేస్తూ.. ఆది గారు మీ పొలంలో మొలకలొచ్చాయ్ అని అనేయడంతో అందరూ నవ్వేశారు. నటకుమారి మాట్లాడుతూ.. మీతో డ్యాన్స్ అంటే భయమేస్తోంది అని చెప్పుకొచ్చింది. నాకు నువ్ పెళ్లాం అన్నప్పటి నుంచే భయం వేస్తోందని పంచ్ వేశాడు
అనంతరం రోహిణి తన కూతురిగా ఎంట్రీ ఇచ్చింది. స్కిట్ కొట్టాలని దాన్ని తెచ్చుకున్నావ్ చివరకు అది నిన్ను కొట్టే స్థాయికి వచ్చావ్ అని కార్తీక్‌పై కౌంటర్ వేశాడు. అంతలో రోహిణి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారూ.. అంటూ అరిచింది. దీంతో చిరాకు పడ్డ ఆది.. ఇంతకు ముందు స్కిట్స్‌లో భార్యగా వేసింది.. ఏవండీ అనేది.. ఇప్పుడు నాన్న అంటోంది అంటూ తెగ బాధపడ్డాడు. పెళ్లయ్యాక మగాళ్లు లుంగీ ఎందుకు కట్టుకుంటారో ఫిలాసఫీ కూడా చెప్పాడు. పెళ్లయ్యాక ఎలాగూ ఊపిరి ఆడదు కదా కనీసం గాలి ఆడాలని కట్టుకుంటారని కౌంటర్ వేశాడు.