జజర్దస్త్ వేదికపై అనసూయ హైపర్ ఆది కాంబో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. రష్మీ సుధీర్ లాగే ఈ ఇద్దరూ కూడా రహస్యంగా స్కిట్ల కోసం కెమిస్ట్రీని వర్కౌట్ చేద్దామని అనుకున్నారేమో. కానీ అనసూయకు పెళ్లి అవ్వడంతో వీరి మధ్య కెమిస్ట్రీ మరోలా ప్రొజెక్ట్ అయింది. ఆ మధ్య అయితే మరీ కాస్త శ్రుతీ మించారు. స్కిట్లలో ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేయడవం, చేతులు పట్టుకోవడం లాంటివి చేశారు.
విమర్శలు ఎక్కువగా వస్తుండటంతో తన స్కిట్స్‌లో అనసూయను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం లేదు. అయితే మళ్లీ హైపర్ ఆది అనసూయను తన స్కిట్స్‌లో వాడటం మొదలెట్టాడు. అనసూయ వల్లే దేవదాసును అయ్యానంటూ ఓ ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చాడు. ఇదంతా నీ వల్లే అంటూ అనసూయను చూస్తు కామెంట్లు చేశాడు. స్కిట్‌లో భాగంగా అనసూయపై సెటైర్ల మీద సెట్లైర్లు వేశాడు.
అనసూయ ఎక్కడికి వెళ్తున్నావ్? అని హైపర్ ఆది అడిగితే.. నీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోదామనుకుంటున్నా అని అనసూయ కౌంటర్ వేసింది. దీంతో వెంటనే..ఎక్కడికి వెళ్తావ్ క్యారవాన్‌లో వెళ్లి కాజు బిర్యానీ తింటాను అని చెప్పొచ్చు కదా అంటూ సెటైర్ వేశాడు. నాకు అకలి వేస్తోందని నీకెలా తెలుసు అంటూ అనసూయ ప్రశ్నించింది. నీకు ఆకలి వేయకపోతే అందరి ఎక్స్‌ప్రెషన్స్ నువ్వే ఇస్తావ్.. ఆకలి వేస్తే నీ ఎక్స్‌ప్రెషన్ కూడా నువ్ ఇవ్వలేవ్ అంటూ అనసూయపై అదిరిపోయే పంచ్ వేశాడు. మొత్తానికి అనసూయకు ఆకలి వేస్తే ఆగలేదని, క్యారవాన్‌లోకి వెళ్లి తినేస్తుందని, అందులో కాజు బిర్యానీ అంటే ఇష్టమని చెప్పకనే చెప్పేశాడు.