రోజు రోజుకి రేవంత్ గ్రాఫ్ పెంచుతున్న హౌస్ మేట్స్.. ఎలాగో తెలుసా..?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టెలివిజన్లో 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఒక ఓటిటి నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో ఇండియన్ గా గుర్తింపు పొందిన రేవంత్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.

సింగర్ గా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. కాకపోతే బిగ్ బాస్ ప్రారంభమైన మొదటి వారం నుండి ఇప్పటివరకు ప్రతి వారంలోనూ రేవంత్ ఎలిమినేషన్ కి నామినేట్ అవుతున్నాడు. అందుకు కారణం రేవంత్ నోటి దురుసుతనం. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్న రేవంత్ చిన్న చిన్న విషయాలకు కూడా హౌస్ మేట్స్ ని కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తూ ప్రతివారం నామినేషన్స్ లో నిలుస్తున్నాడు.

అయినప్పటికీ రేవంత్ కి బయట ఉన్న ఫాలోయింగ్ వల్ల ప్రతివారం అత్యధిక ఓటింగ్ తో నామినేషన్స్ నుండి బయటపడదు టైటిల్ విన్నర్ దిశగా కొనసాగుతున్నాడు. ఇలా హౌస్ మేట్స్ అందరూ ప్రతివారం రేవంత్ ని నామినేట్ చేయడం వల్ల అతని అభిమానులు కూడా తమ ఓటింగ్స్ తో రేవంత్ ని సేవ్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆదివారం లో కూడా రేవంత్ అత్యధిక ఓటింగ్ తో నామినేషన్స్ నుండి సేవ్ అవుతున్నాడు. అయితే హౌస్ మేట్స్ అందరూ రేవంత్ మీద ఎక్కువగా టార్గెట్ చేసి ఇలా ప్రతివారం నామినేట్ చేయడంతో ప్రేక్షకులు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ అతన్ని సేవ్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల రేవంత్ టాప్ ఫైవ్ లో నెంబర్ వన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.