కార్తీక్ దీపను చూసిన హిమ…. మరోసారి గుండెపోటుకు గురైన దీప!

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…చారుశీల దీపకు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయో లేదో కనుక్కోవాలని అనుకుంటుంది. అంతలోపే పండరే అక్కడికి రావడంతో రా పండరి నేను చెప్పిన మందులు దీపకు ఇస్తున్నావా అనడంతో ఇస్తున్నానమ్మా అని చెబుతుంది.అయితే ఆ మందులు వేసుకోగానే దీపమ్మకు గుండెల్లో మంటగా ఉందని చెప్పింది అనడంతో అయితే నేను ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయన్నమాట అని చారుశీల మనసులో అనుకొని అలాగే ఉంటుంది. నువ్వు మందులు ఇవ్వడం ఆపద్దని చెప్పి పంపిస్తుంది.

మరోవైపు సౌందర్య ఆనందరావు కారులో ప్రయాణిస్తూ ఉండగా అసలు కార్తీక దీప ఇదే ఊర్లోనే ఉన్నారా అని సందేహపడగా ఉన్నారు. నేను గుళ్లు హాస్పిటల్ అన్ని వెతికాను అయినా మనకు కనిపించలేదు అని సౌందర్య మాట్లాడుతుంది. వాళ్లు మనకు కనిపించలేదా కావాలనే కనిపించకుండా దూరంగా ఉన్నారా అని ఆనందరావు సందేహపడతాడు.నాకెందుకో మన చుట్టూ ఉన్నవాళ్లే మనకు అబద్ధం చెబుతున్నారనిపిస్తుంది అంటూ ఆనందరావు అనడంతో సౌందర్య కూడా ఆలోచనలో పడుతుంది.
కార్తీక్ దీప ఒకచోట ఇంద్రుడితో కలిసి మాట్లాడుతుంటారు. నన్ను క్షమించు ఇంద్రుడు మా బిడ్డను మాకు ఇవ్వకుండా దూరం చేస్తున్నావ్ అనుకున్నాను కానీ మాకన్న బాగా మా కూతుర్ని చూసుకుంటున్నావు అని దీప మాట్లాడుతుంది. మీరునం తీర్చుకోలేము అంటూ దీప మాట్లాడటంతో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా.. నీ పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది అని చంద్రుడు చెప్పడంతో వెనుక నుంచి కార్తీక్ మాట్లాడొద్దని సైగలు చేస్తాడు. అప్పుడు కార్తీక్ మాప్రాణాలు క్షేమంగా ఉండేలా ఉంటే అందరం కలిసి ఉండేవాళ్ళం కదా అని కార్తీక్ మాట్లాడుతాడు.

అప్పుడు దీప మాట్లాడుతూ సౌర్య కనీసం వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర అన్న ఉండి ఉంటే బాగుండేది అనడంతో ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది కదా అమ్మ అని ఇంద్రుడు చెబుతాడు.ఏంటి అని కార్తీక్ దీప అడగడంతో నిన్ననే సౌందర్య మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. శౌర్య కోసం వాళ్లు కూడా ఇక్కడే ఒక పెద్దిల్లు తీసుకున్నారు. మేమంతా కలిసే ఉంటున్నాము అని చెప్పడంతో దీపా ఎంతో సంతోషపడుతుంది. అంటే హిమ కూడా ఇక్కడే ఉందా అనడంతో ఉన్నారని చంద్రుడు చెప్పగా సౌర్యను నాకు ఎలాగ చూపించావో అలాగే మా అత్తమ్మ వాళ్ళని హిమని కూడా చూపించు ఇంద్రుడు అని మాట్లాడుతుంది.

అదే సమయంలోనే హిమా తన తల్లిదండ్రులను వెతుకుతూ రోడ్డు వెంట రాగా ఇంద్రుడు చూసి హిమ ఇటువైపే వస్తుంది అని చెప్పడంతో దీప హిమనా నేను హిమని చూడాలి అంటూ అరవగా తన గొంతు గుర్తుపట్టి హిమా అమ్మ డాడీ అంటూ పరుగులు పెడుతుంది.కార్తీక్ తనని చూడకుండా దీపను తీసుకెళ్లి దాక్కుంటాడు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో హిమ బాధపడుతుంది. ఇలా తల్లిదండ్రుల కోసం హిమ ఏడుస్తుండడం చూసి కార్తీక్ దీప బాధపడతారు.ఇదే విషయం వాళ్ళ తాతయ్య నాన్నమ్మకు చెప్పగా శౌర్య మాత్రం అబద్ధాలు చెబుతున్నావా ఇన్ని రోజులు నాకు కనిపించిన అమ్మానాన్నలు నీకు ఎలా కనిపిస్తారు అలా చెబితే నేను నీతో మాట్లాడతానని నాటకాలు ఆడుతున్నావా అంటూ హిమపై కోప్పడుతుంది.

మరోవైపు చారుశీల మందులు కరెక్ట్ గా వాడితే ఈ పాటికి దీపకుగుండెపోటు రావాలి కదా ఇంకారాలేదేంటి ఒకవేళ తనకు గుండెపోటు రాకపోతే పండరీకి చెప్పి కాస్త డోస్ పెంచేస్తాను అని చారుశీల మనసులో మాట్లాడుకుంటుంది. అయితే అదే సమయంలోనే దీపకు గుండెపోటు రావడంతో కార్తీక్ తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అయితే పండరి దీపకు గుండెపోటు రావడం చూసి కంగారుపడుతుంది.