ఢీ షో నుండి తప్పుకోవటానికి కారణం అతనే… శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డాన్స్ కొరియోగ్రాఫర్ లో ఉన్నా కూడా శేఖర్ మాస్టర్ కి ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు చాలా ప్రత్యేకం. ఢీ లో కంటెస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత అదే షోకి జడ్జిగా వెళ్లే స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలలో కచ్చితంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉండాల్సిందే. ఇలా స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన శేఖర్ మాస్టర్ ఢీ షో లో చాలా ఏళ్ళు జడ్జ్ గా వ్యవహరించాడు.

కొరియోగ్రాఫర్ గా వరుస సినిమాలతో బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో కూడా జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకున్నాడు. ఇలా ఈటీవీలో ప్రసారమైన ఢీ, జబర్ధస్త్ వంటి షోస్ కి జడ్జిగా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ అనే డాన్స్ షో కి జడ్జిగా కొనసాగుతున్నాడు. అయితే శేఖర్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చిపెట్టిన ఢీ షో నుండి బయటకి రావడానికి గల కారణాల గురించి ఇటీవల శేఖర్ మాస్టర్ వెల్లడించారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఢీ షో లో జడ్జ్ గా చేస్తున్న సమయంలో ఓంకార్ నుండి మంచి ఆఫర్ వచ్చింది. ఓంకార్ నాకు చాలా ఆత్మీయమైన వ్యక్తి కావటం వల్ల అతడు ఇచ్చిన ఆఫర్ ని కాదనలేక మల్లెమాల వారితో మాట్లాడి ఆ షో కి వెళ్లాను. అయితే ఆ తర్వాత మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధల వల్ల కామటి స్టార్స్ షో వదిలేసి ఈ టీవీకి తిరిగి రమ్మని చెప్పారు. కానీ మా టీవీ వారితో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల తిరిగి ఈటీవీ కి వెళ్లలేక పోయాను అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.