మోక్షజ్ఞ సినిమాలలోకి వచ్చినా.. అది సాధ్యం కాదు వేణు స్వామి కామెంట్స్ వైరల్!

ప్రముఖ ఆస్ట్రాలర్ వేణు స్వామి ఈమధ్య కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో వేణు స్వామి సినిమా సెలబ్రిటీల గురించి వారి జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన చెప్పిన జాతకం సమంత నాగచైతన్య విషయంలో కరెక్ట్ కావడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది.ఇప్పటికే రష్మిక, విజయ్ దేవరకొండ, ప్రభాస్, నయనతార, అనుష్క వంటి వారి జాతకం చెప్పిన వేణు స్వామి తాజాగా మోక్షజ్ఞ జాతకం గురించి చెప్పారు.

ఈ సందర్భంగా వేణు స్వామి మోక్షజ్ఞ జాతకం చెబుతూ మోక్షజ్ఞ జాతకం తాను చూసానని ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆగ్ర హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని తెలిపారు. అయితే ఈయన ఇండస్ట్రీకి రావడానికి మరో మూడు సంవత్సరాల సమయం పడుతుందని వేణు స్వామి తెలిపారు. ఈయన కెరియర్ మొత్తం ఇండస్ట్రీలోనే కొనసాగుతుందని వేణు స్వామి తెలిపారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈయనకు రాజకీయాలలోకి రావడం సాధ్యం కాదని ఆయన జాతక ప్రకారం ఈయనకు రాజకీయ యోగం లేదని వేణు స్వామి వెల్లడించారు. ప్రస్తుతం వేణు స్వామి మోక్షజ్ఞ సినీ కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి మోక్షజ్ఞ విషయంలో వేణు స్వామి వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాల్సి ఉంది.