మహేష్ బాబును ఎప్పుడు అలా చూడలేదు.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల కృష్ణ మొదటి భార్య మహేష్ బాబు తల్లి అయిన ఇందిరా దేవి అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంతో పాటు యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం విజయనిర్మల మరణించింది ఆ తర్వాత ఇటీవల ఇంధరాదేవి కూడా మరణించడంతో కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

ఇక కన్నతల్లి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిలా కనిపించే మహేష్ బాబు తల్లి మరణంతో అతనిలో జీవం కోల్పోయినట్లు మారిపోయాడు. ఇందిరా దేవి మరణం పట్ల ఎంతోమంది సినీ రాజకీయ, ప్రముఖులు నివాళులు అర్పించి సంతాపం తెలియజేశారు. ఇక ఇటీవల ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇందిరా దేవి మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

ఈ క్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..ఇందిరమ్మ మరణం నన్ను ఎంతో బాధించింది. ఇందిరా దేవి ఎక్కువగా మాట్లాడకుండా ఎప్పుడు చిరునవ్వుతోనే అందరిని పలకరిస్తూ మహాలక్ష్మిలా ఉంటారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో మరణించటం ఎంతో బాధాకరం. ఇక ఇటీవల ఆమె సంస్మరణ సభలో కృష్ణగారిని కలిశానని.. భార్య మరణించిన తర్వాత గుండె నిబ్బరం చేసుకొని కూర్చున్న ఆయన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. ఇక ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే మహేశ్‌బాబుని అంత దిగులుగా చూస్తానని ఎప్పుడూ చూడలేదు” అంటూ పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.