నేను జబర్దస్త్ కి దూరం కావటానికి అతనే కారణం: ధనరాజ్

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుని మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ షో పాపులర్ అవ్వటమే కాకుండా ఈ షోలో పనిచేసిన ఎంతోమంది కమెడియన్స్ కూడా బాగా పాపులర్ అయ్యారు. అయితే వీరిలో కొంతమంది వారి వ్యక్తిగత కారణాలవల్ల జబర్దస్త్ దూరమయ్యారు. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొంది ఆ షో కి దూరమైన వారిలో ధనరాజ్ కూడా ఒక.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ధనరాజ్ కమెడియన్ గా సినిమాలలో కూడా మంచి మంచి అవకాశాలు అందుకున్నాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలు రావడంతో పాటు ఇతర ఛానల్లో అధిక రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్ల ధనరాజ్ జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ఇటీవల యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనరాజ్ జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు. ఈ క్రమంలో ధనరాజ్ మాట్లాడుతూ.. జబర్దస్త్ వదులుకొని జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేశానని, తెలుసుకొని మళ్లీ జబర్దస్త్ లో రియంట్రి ఇవ్వాలని చూసినా కూడా ఆ అవకాశం నాకు లేదు అంటూ బాధపడ్డాడు.

అయితే ఈ విషయంలో వేణు చెప్పిన మాటలు విని జబర్దస్త్ కి దూరమయ్యానని అందువల్ల తరచూ వేణుని తిట్టుకుంటూ ఉంటానని ధనరాజ్ వెల్లడించాడు. మాటీవీలో ప్రసారమైన మా టాకీస్ అనే షోకి యాంకర్లుగా అవకాశం వచ్చిందని వేణు చెప్పటం వల్ల జబర్దస్త్ నుండి మాటీవీ కి వెళ్ళానని ధనరాజ్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధనరాజ్ కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా సినిమాలలో నటిస్తున్నాడు. వేణు గురించి ధనరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.