కమెడియన్ రాంప్రసాద్ ఫ్యామిలీ ఫోటోలను ఎప్పుడైనా చూశారా.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫొటోస్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు.ఆటో రాంప్రసాద్ కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఎంతో గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ఏకంగా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

సుడిగాలి సుదీర్ గెటప్ శీను ఆటో రాంప్రసాద్ ముగ్గురు ఒక టీమ్ గా ఏర్పడి ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇకపోతే ఆటో రాంప్రసాద్ వరకు మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పటివరకు ఈయన వ్యక్తిగత విషయాల గురించి ఈయన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు.అయితే తాజాగా ఆటో రాంప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..

ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ ఫ్యామిలీ ఫోటోలు చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటో రాంప్రసాద్ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన కూతురి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా తన భార్య కొడుకు కూతురుతో కలిసి దిగినటువంటి ఈ ఫోటోలను చూసినటువంటి నెటిజన్ లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.