సాయం చేయకున్నా పర్వాలేదు.. ఆ పని మాత్రం చేయొద్దు – రష్మి

తెలుగు బుల్లితెర కార్యక్రమాల ద్వారా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు యాంకర్ రష్మీ.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైనటువంటి ఈమె యాంకర్ గా కన్నా ముందుగా పలు వెండితెర సినిమాలలో నటించే సందడి చేశారు. అయితే తనకు సినిమాల ద్వారా ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా బుల్లితెరపై రష్మి పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉండిపోయారు.

ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం ఈటీవీలో ఏకంగా మూడు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రశ్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక ఈమెకు వ్యక్తిగతంగా మూగజీవాలు అంటే ఎంతో ప్రాణం వాటిని ఎవరైనా హింసిస్తే కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఈమె వెనకాడదు అలాగే మూగజీవాలు ఏవైనా ప్రమాదం బారిన పడితే వాటికి సొంత డబ్బుతో వైద్యం చేయిస్తుంది.

కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో మూగజీవాల ఆకలి బాధలు తెలుసుకున్నటువంటి రష్మీ వాటికి ఆహారం వండిపెట్టింది.ఇలా మూగజీవుల పట్ల ఎంతో ప్రేమ చూపించేటటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా కొంతమందికి జంతువులను ప్రేమించడం రాదు అలాంటప్పుడు వాటిని హింసించే హక్కు కూడా ఉండదు అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ కొటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా జంతువులకు సహాయం చేయకున్నా పర్వాలేదు కానీ మీరు వాటిని హింసించకుండా ఉంటేనే మీరు చేసే పెద్ద సహాయం అన్నట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా జంతువులపై తనకున్న ప్రేమను మరోసారి వ్యక్తపరిచారు.