సంతోషంలో ఉన్న తులసి.. కళ్ళు తిరిగి పడిపోయిన అనసూయ!

కుటుంబ కథ నేపథ్యంలో కుటుంబం నుంచి దూరమై ఒంటరిగా జీవితంలో పోరాటం చేస్తున్న ఓ మహిళ కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గృహలక్ష్మి సీరియల్ రోజురోజుకు మంచి ఆదరణ పొందుతుంది. నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే రోడ్డుపై సామ్రాట్ తెలిసి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ సంతోషంగా నడుచుకుంటూ వెళ్తారు. మధ్యలో ఐస్ క్రీమ్ బండి కనపడగానే ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోదాం అంటూ ప్లాన్ చేస్తారు.దీంతో సామ్రాట్ భయపడుతూనే అక్కడికి పరిగెత్తగా ఎందుకండీ అలా భయపడతారు మీకు తెలియకుండా నేను డబ్బులు ఇచ్చాను అంటూ షాక్ ఇస్తుంది.

ఈ విధంగా మీరు డబ్బులు ఇచ్చి నన్ను రోడ్డుపై పరుగులు పెట్టిస్తున్నారా అంటూ సామ్రాట్ షాక్ అవుతారు. ఇక ఇద్దరు కలిసి సరదాగా నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తారు. మరోవైపు పరంధామయ్య బయట కూర్చుని ఉండగా అనసూయ అక్కడికి వెళ్లి నేను చేసినది తప్పు నన్ను క్షమించండి అంటూ తనని క్షమాపణలు కోరుతుంది. అదే సమయంలో పరంధామయ్య ఈ ఇంటికి యజమాని రాలుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాల్సిన దానివి ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చూడు అంటూ చెబుతాడు.

ఇలా వీరిద్దరూ మాట్లాడుతూ ఉండగా అనసూయ తనని క్షమించమని కోరుతుంది.మీరు నన్ను క్షమిస్తానని చెప్పే వరకు ఇలాగే మిమ్మల్ని క్షమాపణ కోరుతూ ఉంటానని చెప్పగా పరంధామయ్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనసూయ ఏవండి అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో పరంధామయ్య ఒక్కసారిగా అనసూయ అని అరవడంతో ఇంట్లో వాళ్ళందరూ వచ్చి తనని లోపలికి తీసుకెళ్తారు. వెంటనే అభి తన నానమ్మకి ఏమైందోనని ట్రీట్మెంట్ ఇస్తారు.

మరోవైపు సామ్రాట్ తులసి ఇల్లు రాగానే తనకు బాయ్ చెప్పి వెళుతుండగా అప్పుడే ప్రేమ్ ఫోన్ చేసి జరిగినది చెబుతాడు. వెంటనే తులసి తన ఇంటికి చేరుకుంటుంది.అభి అనసూయకు చికిత్స చేస్తుండగా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. అదే సమయంలో తులసి వెళ్లగా అనసూయకు మెలకువ వచ్చి తులసి అని కలవరిస్తుంది.లాస్య అని పిలవగా ఇక్కడే ఉన్నాను అత్తయ్య అంటూ చెప్పడంతో నువ్వు బయటకు వెళ్ళు నేను వీరితో మాట్లాడాలి అని చెబుతుంది. దాంతో లాస్య కాసేపు వాదనకు దిగుతుంది. అదే సమయంలో నందు లాస్యను బయటకు వెళ్ళమని కోప్పడతారు.నన్ను క్షమించమ్మా అంటూ రెండు చేతులు జోడించి తనకు క్షమాపణలు చెప్పగా మీరు మాకన్నా పెద్ద వాళ్ళ అత్తయ్య మీ ఆశీర్వాదాలు మాకు కావాలి కానీ ఇలా క్షమాపణలు అడగకూడదు అంటూ మేము వయసులో మాత్రమే పెద్దవాళ్లు బుద్ధిలో చాలా చిన్నవాళ్లు అంటూ తనని క్షమాపణలు కోరుతుంది.