మనసులో బాధను బయటపెట్టిన గోవిందరాజులు…. మరోసారి జానకిని అపార్థం చేసుకున్న అఖిల్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న జానకి కలగనలేదు సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే మల్లికా జెస్సి రిపోర్ట్స్ తీసుకొని వెళ్తూ ఉండగా జ్ఞానాంబ తనని పిలుస్తుంది. దీంతో మల్లిక కంగారుపడి రిపోర్ట్స్ పక్కన పెట్టి తన వద్దకు వెళుతుంది. అది చూసిన జానకి వెంటనే ఆ రిపోర్ట్స్ తీసుకుని తన గదిలోకి వెళ్లి చించేస్తుంది.తిరిగి వచ్చి మల్లిక రిపోర్ట్స్ కోసం చూడగా రిపోర్ట్స్ కనిపించకపోవడంతో జానకి రిపోర్ట్స్ విషయంలో ఏదో దాస్తుంది అనే సందేహబడుతుంది.

 

బయట రామ బండి శుభ్రం చేస్తూ ఉండగా గోవిందరాజులు కిందికి దిగుతూ గుండెల్లో నొప్పి రావడంతో ఒక్కసారిగా కింద పడబోతుండడంతో రామ తనని పట్టుకుని కూర్చో పెడతాడు. వెంటనే గదిలోకి వెళ్లి టాబ్లెట్స్ తీసుకుంటూ పరుగులు పెట్టగా జ్ఞానంబ తనకు ఏమైంది అని కంగారుతో బయటకు వస్తుంది. వెంటనే జానకి కూడా వస్తుంది. దీంతో టాబ్లెట్స్ వేసుకున్న తరువాత గోవిందరాజులు కాస్త గుండెలో నొప్పి వచ్చింది అంటాడు.తనకు ఏదైనా జరిగితే ఇంటి బాధ్యతలను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా రామ అంటాడు.

 

ఏ తండ్రి కైనాతనకు ఏమైనా అయితే కుటుంబం ఏమవుతుందోనని కంగారు పడతారు నాకు ఆ కంగారు లేదు ఎందుకంటే 10 సంవత్సరాల వయసులోనే నువ్వు ఈ కుటుంబ బాధ్యతలను నీపై వేసుకున్నావుఅని చెబుతాడు దీంతో జ్ఞానంబ ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు అని అనడంతో నాకు ఎలాంటి దిగాలు లేవు అఖిల్ ఏదైనా ఉద్యోగం చూసుకొని తన జీవితంలో స్థిరపడాలి అలాగే వెన్నెల పెళ్లి జరిగిపోతే నాకు ఎలాంటి ఆలోచనలు ఉండవని తన మనసులో ఉన్న బాధను బయట పెట్టాడు.

 

 

అనంతరం రామ తన తండ్రిని తీసుకొని గదిలోకి వెళ్ళగా అఖిల్ చదువు పూర్తి అయింది కదా ఎక్కడో ఒకచోట ఉద్యోగం చూసుకుంటాడు అని రామా చెప్పడంతో వెంటనే జానకి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అందుకు అనుకూలంగా జాబ్ చూసుకోమని మీరే చెప్పండి సాధారణంగా జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు కానీ అఖిల్ తొందరపడి పెళ్లి చేసుకున్నారు అంటూ రామాతో చెబుతుంది. ఇదంతా విన్నటువంటి అఖిల్ ఎందుకు వదిన నేను అంటే మీకు అంత కోపం.మీరు నా గురించి ప్రతిసారి ఇలాగే ఆలోచించి అందరి ముందు నన్ను చెడు చేస్తున్నారు అంటూ మాట్లాడుతారు.

 

అఖిల్ ఇలా జానకిని అపార్థం చేసుకోవడంతో రామ ఇప్పుడు మీ వదిన తప్పుగా ఏమి మాట్లాడలేదని చెబుతాడు. ఇక అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మీరేమీ బాధపడకండి అంటూ జానకికి సర్దు చెబుతాడు. మరోవైపు జెసి మందుల కోసం చీటీ తీసుకు వెళుతుండగా దానిని తీసుకున్న నన్నే అడుగు అంటూ చెబుతాడు ఉద్యోగం కోసం వెళ్తున్నాం అన్నట్టు నటిస్తూ సర్టిఫికెట్స్ కోసం వెతుకుతూ జెస్సీ ముందు నటిస్తూ ఉంటాడు.