బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…. ఎలాగైనా ఇల్లు విడిపించుకోవాలని ఇంట్లో ప్రతి ఒకరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని గోవిందరాజులు తనకు తెలిసిన వారికి ఫోన్లు చేసి అడుగుతుంటారు అయితే తన చిన్నబ్బాయి ఉద్యోగం కోసం తన కొడుకు ఇల్లు తాకట్టు పెట్టారని చెబుతుంటాడు. ఈ విషయం విన్నటువంటి అఖిల్ తన తండ్రి వద్దకు వెళ్లి మీరు ఎవరినైనా డబ్బు అడగండి అంతేకానీ నా పేరు మాత్రం చెప్పకండి అని చెప్పి అయినా ఇదంతా పెద్ద వదిన వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అఖిల్ ఇలా మాట్లాడటంతో గోవిందరాజులు జానకి ఇద్దరు బాధపడతాడు. తన రామ అమాయకత్వంతో మోసపోయాడని కానీ తన కుటుంభం ముక్కలు కాకుండా చూసే బాధ్యత నీదే అని జానకికి చెబుతాడు. జానకి కూడా కుటుంబం విడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తానని చెబుతుంది. ఇక రామ అందరిని డబ్బులు అడుగుతూ ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే జ్ఞానంభ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడాలని చూడగా ఆమె మాత్రం మాట్లాడటానికి ఇష్టపడదు. అప్పుడే మల్లికా బ్యాగ్ సర్దుకొని బయటకు వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావని అడగడంతో ఎలాగో బావగారు ఆపు తీర్చలేరు రేపు ఆ భాస్కర్ రావు వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటారు. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెబుతుంది.
కుటుంబం అన్న తర్వాత సంతోషం ఉన్నప్పుడే కాదు ఇలాంటి కష్ట సమయాలలో కూడా ఒకరికొకరు తోడుండాలి అని జానకి చెబుతున్నప్పటికీ వినిపించుకోదు అలాగే ఇంట్లో వాళ్ళు తనకు చెప్పడంతో విష్ణు కూడా వెళ్లడానికి ఇష్టపడడు.అప్పుడు జ్ఞానంబ ఇంటి అప్పు తీర్చడం కోసం ఏదో ఒకటి చేయాలి అనుకొని తన దగ్గర ఉన్న నగలతో పాటు ఒంటిపై ఉన్న నగలు కూడా తీసుకువచ్చి వాటిని తాకట్టు పెట్టాలని చెబుతుంది. అలాగే జెస్సి జానకి కూడా తమ వద్ద ఉన్న నగలని ఇస్తారు. ఇక మల్లిక మాత్రం తన దగ్గర కేవలం ఉంగరం మాత్రమే ఉందని చెబుతుంది.
జ్ఞానాంబ నగలను తీసుకొని తాకట్టు పెట్టి ఎలాగైనా ఇల్లు విడిపించుకోవాలని వెళుతుంది. మరోవైపు కన్నబాబు రామాను ఉద్దేశించి తమ్ముడు పేరును అడ్డుపెట్టుకొని భార్యతో కలిసి భారీగా అప్పు చేశావు అంటూ తనని చులకనగా మాట్లాడుతారు. ఇలా కన్నబాబు గ్రామానికించపరుస్తూ తను ఎలాగో డబ్బు కట్టలేదని తన కసిపగా తీరిందని సంతోషపడుతుంటాడు.ఇక రామ అన్నిచోట్ల ప్రయత్నం చేసి తనకి ఎక్కడ డబ్బు సర్దుబాటు కాలేదని బాధపడుతుంటాడు తర్వాత ఎపిసోడ్లు భాస్కర్ రావు వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పుదంతో తన కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది