బిగ్ బాస్ హౌస్ లో గీతు రాయల్ ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన ఆమె భర్త …?

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ షో గురించి రివ్యూ లు ఇస్తు పాపులర్ అయిన గీతు రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న గీతు తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న కూడా హౌస్ లో బెస్ట్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ బిగ్ బాస్ టైటిల్ కోసం గట్టి పోటీ ఇస్తోంది. ఇలా తన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన గీతు రాయల్ భర్త వికాస్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తమిళ నేపథ్య కుటుంబానికి చెందిన వికాస్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. గీతు తన పక్కన లేకపోవటంతో తనని చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. కాకపోతే తన భార్యను ఇలా టీవీలో చూడటం చాలా సంతోషంగా ఉంది అంటూ వెల్లడించాడు. బిగ్ బాస్ హౌస్ లో గీతు అటతీరు తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించాడు. తన ఆటతీరుతో ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో గీతో తన మాట తీరువల్ల విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోందని.. అయితే ఇంట్లో కూడా గీతూ అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు. సహజంగా ఆమె మాట తీరు చాలా కట్టుగా ఉన్నా కూడా ఆమె చాలా మృదుస్వభావి. గీతు ఎవరినైనా పలకరించేటప్పుడు కూడా ఆమె మాట తీరు చాలా కటువుగా ఉంటుంది అంటూ తెలియచేశాడు. ఇంట్లో బయట ఎలా ఉంటుందో.. బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంటుంది. అంతే కానీ కేవలం ఓట్లు కోసం అలా ప్రవర్తించటం లేదు అంటూ భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు.