బిగ్ బాస్ హౌస్ లో దూకుడు పెంచిన ఫైమా.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో నిలుస్తుందా?

ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వారా ఫైమా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ షో ద్వారా గుర్తింపు పొందిన ఫైమా ఆ తర్వాత జబర్దస్త్ యాజమాన్యం దృష్టిని ఆకర్షించి జబర్దస్త్ లో కనిపించే అవకాశం అందుకుంది. ఇలా జబర్దస్త్ లో అడుగుపెట్టిన ఫైమా బుల్లెట్ భాస్కర్ టీం లో సందడి చేస్తూ తన కామెడీ పంచులు, సెటైర్లతో బాగా ఫేమస్ అయ్యింది. ఇలా ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న లేడీ కమెడియన్లు లో ఒకరిగా ఫైమా మంచి గుర్తింపు పొందింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఫైమా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.

దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లు లో పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆరవ సీజన్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభమైన ఈ ఆరవ సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో జబర్దస్త్ నుండి చలాకి చంటి, పైమా పాల్గొన్నారు. చలాకీ చంటి నాలుగవ వారంలోనే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి రాగా ఫైమా మాత్రం షో ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకు ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోంది.

ఇలా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఫైమా బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేస్తూ ఇంటి సభ్యులను కూడా ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే 6 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆరు వారాలలో ఫైమా మా తన ఆటతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంతో ఈమె ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలుస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైన బిగ్ బాస్ హౌస్ లో ఇదే జోరు కొనసాగితే టాప్ టు స్థానంలో ఉన్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎపిసోడ్స్ లో ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలుస్తుందో లేదో చూడాలి మరి.