బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే రామా చేసిన పనికి ఇంట్లో వారందరూ తనని అసహ్యించుకుంటారు. జానకి తన మామయ్యకు సేవలు చేయడానికి వెళ్లడంతో జ్ఞానంభ అడ్డుకుంటుంది. అంతలోపే చికిత అని పిలిచి డాక్టర్ గారు రాసించిన ఆయిల్ గోవిందరాజులకు కాళ్లు చేతులకు మర్దన చేయమంటుంది నేను వెళ్లి రాగి జావా చేసుకుని వస్తానని చెప్పి వెళ్తుంది. దీంతో జానకి నేను వెళ్లి చేసుకొస్తాను అత్తయ్య అనడంతో అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇక చికిత చేతిలో నుంచి ఆయిల్ జానికి తీసుకొని మర్దన చేయబోతుండగా గోవిందరాజులు పిలుస్తారు. మల్లికా ఇదే అదునుగా భావించి నీ వల్లే మామయ్యకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.ఇంటి బాధ్యతలు నీపై పెట్టడం వల్ల ఇంటి పరువు తో పాటు ఇల్లు కూడా పోయే పరిస్థితికి వచ్చింది అని రెచ్చగొడుతుంది. ఇక జ్ఞానంభ వద్దకు వెళ్లి మీకెందుకు ఇవన్నీ నేను చేస్తాను కదా అత్తయ్య అంటూ మల్లిక తనని మరింత రెచ్చగొడుతుంది.ఇక నీళ్లు తాగడం కోసం గోవిందరాజులు కిందకు వంగి పడిపోతుండడంతో వెంటనే రామ పట్టుకొని తనకి నేను తాగిస్తారు. అక్కడికి వచ్చిన జ్ఞానంభ ఏం జరిగింది అనడంతో జానకి జరిగినది మొత్తం చెబుతుంది.
నాన్న మీరు ఇంకొకసారి ఇలా జరగకుండా ఉండాలంటే ఇది మంచిది అంటూ తనకు వీల్ చైర్ తీసుకొస్తాడు అది చూసిన తన తల్లి ఈ వయసులో చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు అంటూ తన కొడుకుని అసహ్యించుకుంటుంది.అమ్మ నన్ను క్షమించు వీలైతే నన్ను కొట్టు కానీ ఇలాంటి మాటలు మాట్లాడకు భరించలేకపోతున్నాను అని రామా చెప్పడంతో నువ్వు నీ తమ్ముడి కోసమే 20 లక్షలు అప్పు చేసి ఉండవచ్చు కానీ ఆ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేశావు అని జ్ఞానంభ అసహ్యించుకుంటుంది దాంతో రామా జానకి బాధపడతారు.
ఇక గదిలో రామా జానకి ఇద్దరు బాధపడుతూ…ఎవరిని అడిగినా కూడా డబ్బు సర్ద లేకపోతున్నారు. ఒకవేళ పోలీసు కేసు పెడదామన్న మన దగ్గర ఎలాంటి సాక్షాలు లేవని బాధపడతారు.ఒకవేళ కేసు పెట్టిన చరణ్ ఎక్కడ ఉన్నాడు తనని వెతికి తీసుకువచ్చే లోపు గడువు కాస్త పూర్తి అవుతుందని ఆలోచిస్తూ ఉంటారు.అయితే జానకి మాత్రం మన దగ్గర ఎంతో నమ్మకంగా ఉండే భాస్కర్ రావు ఇలా ఉన్నఫలంగా మనకు గడువు విధించడానికి కారణం ఏంటి దీని వెనుక ఎవరున్నారు అని ఆలోచిస్తుంది.అయితే భాస్కర్ రావు రామా ఇంటి కాగితాలను తీసుకెళ్లి కన్నబాబు చేతిలో పెడతారు అవి చూస్తున్న కన్నబాబు సంతోష పడతాడు.