గతం గుర్తొచ్చిందని నిజం చెప్పిన డాక్టర్ బాబు… మరోసారి అనారోగ్యానికి గురైన వంటలక్క!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే కార్తీక దీపం సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప హెల్త్ కండిషన్ గురించి కార్తీక్ కంగారు పడుతూ దీప గతంలో బాధపడుతున్న వ్యాధితో బాధపడుతుంది. అలాగే తన హార్ట్ కూడా చాలా వీక్ గా ఉంది వెంటనే తనకు సర్జరీ చేయించాలి ఈ విషయం తనకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు.అంతలోపే కార్తీక్ అక్కడికి వెళ్లడంతో వెంటనే వంటలక్క వెళ్లిన పని ఏమైంది డాక్టర్ బాబు అని అడుగుతుంది. ఆ పని తర్వాత చూద్దాం కానీ ముందు హాస్పిటల్ కి వెళ్దామంటే ఏమైంది డాక్టర్ బాబు అంటూ కంగారుపడుతుంది. నాకు కాదు నీకోసం హాస్పిటల్ కి వెళ్దామని కార్తీక్ చెప్పగా సౌర్య దొరికే వరకు నేను హాస్పిటల్ కి రానని చెప్పాను కదా అంటూ మొండి చేస్తుంది.

ఇక మీరు ఇలా కూర్చోండి నేను ఇప్పుడే వంట చేసి తీసుకు వస్తాను అంటూ దీప చెప్పగా వద్దు నేనే వంట చేసుకోవస్తాను అని కార్తీక్ చెబుతాడు వినకుండా దీప వెళ్లగా కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నువ్వు ఎవరు నా గురించి పట్టించుకోవడానికి అని అడుగుతావేమో నేను నీ దగ్గర ఓ విషయం దాచి పెట్టాను. నాకు గతం గుర్తొచ్చి చాలా రోజులైంది దీప ఈ విషయం నీకు చెబితే ఆమోనిత నేనేం చేస్తుందోనన్న భయంతో చెప్పకుండా ఉండిపోయాను అంటూ తనకు గతం గుర్తొచ్చిన విషయం చెప్పి వెనక్కి తిరుగుతాడు. అయితే అప్పటికే దీప కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటే వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. తన హెల్త్ కండిషన్ మొత్తం డాక్టర్ కి వివరించగా మీరు డాక్టర్ అయ్యుండు కొని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని డాక్టర్ ప్రశ్నిస్తారు.

తాను హైదరాబాదులో డాక్టర్ అని అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని కార్తీక్ చెప్పడమే కాకుండా తనకు వెంటనే సర్జరీకి ఏర్పాటు చేయమని చెబుతారు.మరోవైపు సౌందర్య ఆనందరావుకు ఫోన్ చేసి మన కొడుకు కోడలు బతికే ఉన్నారు. అని చెప్పగా ఆనంద్ రావు సంతోషపడతారు మీరు వెంటనే హిమ ఆనంద్ నుతీసుకొని ఇక్కడికి వచ్చేసేయండి అంటూ సౌందర్య చెప్పగా వెంటనే ఆనందరావు వారిని ఎప్పుడెప్పుడు చూడాలా అని సంతోషంగా ఉంది అంటూ బయలుదేరుతారు.

మరోవైపు దీప శౌర్య ఫోటో చూస్తూ హాస్పిటల్ బెడ్ బై ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కార్తీక్ వెళ్లి నువ్వు దేని గురించి ఆలోచించద్దని చెప్పాను కదా నీకు హార్ట్ లో చిన్న హోల్ ఉంది సర్జరీ చేయాలి దీప అంటూ చెప్పడంతో నాకేమైంది డాక్టర్ బాబు నేను బతుకుతాను అంటూ కంగారు పడుతుంది. ఏం కాలేదని కార్తీక్ చెబుతున్నప్పటికీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం డాక్టర్ బాబు అంటూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. మరోవైపు మౌనిత కార్తీక్ గురించి కంగారుపడుతూ ఉంటారు. రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నప్పటికీ కనెక్ట్ అవ్వడం లేదు ఎక్కడికి వెళ్లారు అంటూ ఆందోళన చెందగా అంతలో శివ అక్కడికి రావడంతో నేను చెప్పిన పని ఏం చేసావ్ శివ అంటుంది.అప్పుడు శివ నా స్నేహితులందరినీ తీసుకెళ్లి సంగారెడ్డిలో వెతికించినా వాళ్ళు కనిపించడం లేదంటూ షాక్ ఇస్తాడు.దీప మాత్రం శౌర్య గురించి ఆలోచిస్తూ తనని వెతకమని చెబుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.