అనసూయతో ఇంత చనువుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వెండితెర సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె గత కొద్దిరోజులుగా అమెరికాలో తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు.ఇలా అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ అమెరికాలోనే స్నేహితుల సమక్షంలో దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇకపోతే అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని విషయాలను అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఒక వ్యక్తితో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతోమంది అనసూయతో సెల్ఫీ దిగిన ఆ వ్యక్తి ఎవరు అతనితో అనసూయ అంత చనువుగా ఉన్నారంటే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ ఫోటో దిగిన వ్యక్తి పేరు ఉజ్వల్. హ్యాపీ బర్త్డే ఉజ్వల్ అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తను జెర్రీ అయితే ఉజ్వల్ టామ్ అంటూ ఈ సందర్భంగా ఈమె వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చారు.

ఇక ఉజ్వల్ ఎవరు అనే విషయం గురించి నెటిజెన్లు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఉజ్వల్ కూడా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగారు ఈయన అడవి శేషు దర్శకత్వంలో 2013వ సంవత్సరంలో తెరకెక్కిన కిస్ అనే సినిమాలో హీరోగా నటించారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మాత్రం నోచుకోలేదు.ఇలా ఈ సినిమాలో హీరోగా నటించిన ఉజ్వల్ అనంతరం ఇండస్ట్రీకి దూరమై అమెరికాలో స్థిరపడ్డారు. ఇలా అనసూయకు మంచి స్నేహితుడు కావడంతో అమెరికా పర్యటనలో భాగంగా తన స్నేహితుడిని కలిసినట్టు తెలుస్తుంది.