టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. గత కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. అలాగే ఓటిటి లో కూడా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తిచేసుకుంది. టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణ పొంది ప్రతీ సీజన్ లోను అధిక రేటింగ్స్తో దూసుకుపోతుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 కూడా ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 6 మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది.
ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. సాధారణంగా బిగ్ బాస్ షో లో పాల్గొన్న వారికి వారి పాపులారిటీ బట్టీ రెమ్యునరేషన్ ఇస్తారు. అయితే ఈ సీజన్ 6 లో పాల్గొన్న వారికి కొంతవరకు రెమ్యూనరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనడంతో రెమ్యూనరేషన్ తగ్గించినట్లు సమాచారం. అయితే ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యూట్యూబర్ గా గుర్తింపు పొందిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బాస్ గురించి రివ్యూలు రేటింగ్ లో ఇస్తూ పాపులర్ అయిన ఆదిరెడ్డి యూట్యూబర్ గా మంచి గుర్తింపు పొందటమే కాకుండా యూట్యూబ్ వీడియోస్ ద్వారా అధిక మొత్తంలో డబ్బు సంపాదించేవాడు. బిగ్ బాస్ షో లో పాల్గొనడం వల్ల పాపులారిటీ వస్తుందని భావించి ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా బిగ్ బాస్ లో పాల్గొనటానికి ఆదిరెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం వారు మాత్రం ఏదో నామమాత్రంగా ఆదిరెడ్డికి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు ఆదిరెడ్డికి ఒక వారానికి దాదాపు రెండు లక్షల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. వీటిలో కటింగ్స్ ఫోను ఆదిరెడ్డికి కేవలం రూ.1.75 లక్షలు మాత్రమే చేతికి అందుతుందని తెలుస్తొంది.