జబర్దస్త్ వర్ష ఒక్క స్కిట్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బుల్లితెర హాట్ బ్యూటీ జబర్దస్త్ భామ వర్ష కుర్రకారు గుండెల్లో రోజురోజుకు గుగులు పుట్టిస్తోందని చెప్పొచ్చు. ప్రస్తుతం వర్ష కామెడీ ఎంటర్టైనర్ ప్రోగ్రామ్స్ అయినా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ షోలలో తన గ్లామర్, టైమింగ్ పంచులతో ప్రేక్షకాదరణ
పొందుతూ బుల్లితెరపై సందడి చేస్తోంది. అంతే కాకుండా వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో బాలీవుడ్ హీరోయిన్లను తలపిస్తోంది బుల్లితెర ఈ బ్యూటీ. జబర్దస్త్ వర్ష బుల్లితెరపై అందచందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా సైట్లను షేక్ చేస్తోంది అంటూ ప్రచారం సాగుతోంది

బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించినప్పటికీ తగిన గుర్తింపు రాలేదని చెప్పాలి. తర్వాత జబర్దస్త్ స్టేజిపై కో ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్‌ తో కలిసి అద్భుతమైన పర్ఫామెన్స్ రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, ఆన్ స్క్రీన్ పర్‌ఫార్‌మెన్స్ వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ గానే ఉంటుంది.జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో ఈ ఇద్దరూ చేసే రొమాంటిక్ హంగామా అందర్నీ ఆకర్షిస్తుంది.

వీరిద్దరి ప్రేమాయణం పక్కన పెడితే జబర్దస్త్ వర్షా కు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన రెమ్యూనరేషన్ పెంచిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో మొదటి ఈ బ్యూటీ కి ఇచ్చే పారితోషకం చాలా తక్కువ .కానీ ఇమ్మానుయేల్ తో స్కిట్స్ చేస్తే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారన్న టాక్ బలంగా వినిపిస్తుంది .అంతేకాదు నార్మల్ స్కిట్స్ చేస్తే 20 వేలు ఎపిసోడ్ కి తీసుకుంటుందని అదే ఇలా ఇమ్మానుయేల్ తో రొమాంటిక్ లవ్ ట్రాక్ లో నటిస్తే దాదాపు 35 వేల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని చర్చ సాగుతోంది.