డబ్బు కోసమే జబర్థస్త్ కి దూరమయ్యా… సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సుధీర్ ఆ తర్వాత రైటర్ గా మారి టీం లీడర్ స్థాయి దాకా చేరుకున్నాడు. ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను తో కలిసి ప్రతివారం అద్భుతమైన స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక రష్మి తో ఉన్న లవ్ ఎఫైర్ వల్ల సుధీర్ మరింత పాపులర్ అయ్యాడు. ఇలా పాపులర్ అయిన సుధీర్ కి సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఎలా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుదీర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు.

అయితే కొంతకాలంగా సుధీర్ జబర్థస్త్ కి దూరమయ్యాడు. సినిమాలలో అవకాశాలు రావటంతో జబర్థస్త్ కి దూరమయ్యాడని వార్తలు వినిపించాయి. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుధీర్… తాను జబర్దస్త్ షో కి దూరం కావటానికి గల కారణాల గురించి వెల్లడించాడు. సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సుధీర్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో తాను జబర్దస్త్ కి దూరం కావటానికి గల కారణం గురించి కూడా బయటపెట్టాడు.

ఈ ఇంటర్వ్యూ లో ‘జబర్దస్త్’ను ‘సుడిగాలి’ సుధీర్ ఎందుకు వీడాల్సి వచ్చింది? ఎందుకు వేరే ఛానళ్ళలో షోస్ చేశారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సుధీర్ స్పందిస్తూ… ‘నేను ‘జబర్దస్త్’ కి దూరం కాలేదు. చిన్న బ్రేక్ ఇచ్చాను అంతే. అది కూడా మల్లెమాల వారితో సంప్రదించి వారి అంగీకారం తర్వాతే నేను జబర్దస్త్ కి బ్రేక్ తీసుకున్నాను. నాకు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల డబ్బు అడ్జస్ట్ చేయమని అడిగాను..కానీ అప్పుడు వాళ్ళు స్టూడియో నిర్మాణంలో ఉండటంతో కుదరలేదు. అందుకే ఆరు నెలలు గ్యాప్ తీసుకోవడానికి ఓకే అన్నారు. ఆరు నెలలు అయిపొయింది. మళ్ళీ మల్లెమాల సంస్థకు ‘నేను వర్క్ చేయడానికి రెడీ’ అని చెప్పాను” అంటూ సుధీర్ వెల్లడించాడు.