అనసూయ చేతిలో చేయి వేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న దర్శకేంద్రుడు..!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న క్యాష్ షో గత కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ ఈ షోలో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీలకు విచిత్రమైన టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ లో వాంటెడ్ పండుగాడు టీం హాజరైంది. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ ఎపిసోడ్ లో విష్ణుప్రియా, యశ్వంత్‌ మాష్టర్, అనసూయ, రాఘవేంద్ర రావు, నిత్య శెట్టి పాల్గొని సందడి చేశారు.

ఇక రాఘవేంద్రరావు అనసూయ చేతిలో చేయి వేసుకొని ఈ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో మేమిద్దరం ఇలా చేతిలో చేయి వేసుకుని ఎందుకు వచ్చామో తెలుసా అని రాఘవేంద్ర రావు అడగ్గా.. అనసూయ మెట్లు ఎక్కలేదు కాబట్టి మీరు తనకి సహాయం చేసారు అని సుమ అంటుంది. ఈ క్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ..కాలేజ్‌లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని ఆమె స్ధానంలో అనసూయ దొరకటంతో ఇలా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను అంటూ వివరించాడు. దీంతో సుమ స్పందిస్తూ అప్పట్లో సుమ పేరుతో ఎవరూ లేరు కదా అని అనగా… నీ పెళ్లి చేసింది నీనే కదా అంటూ రాఘవేంద్రరావు చెప్పాడు. దీనికి రియాక్ట్ అయిన సుమ `ఆ పాపం మాత్రం మీదే సర్‌` అంటూ పంచ్ వేసింది.

ఇక రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఎలాగైనా ఈ షోలో 10 కోట్లు గెలుచుకోవడానికి వచ్చాను అని అనగా 10 కోట్లు కావాలంటే అనసూయని తీసుకెళ్లండి 100 కోట్లు కావాలంటే నన్ను తీసుకెళ్లండి అని సుమా అనగానే కచ్చితంగా 100 కోట్లే కావాలి అని రాఘవేంద్రరావు అనగానే సుమ తెల్ల మొహం వేసింది. ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం ఫుల్ నవ్వులతో సాగిపోయింది. రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ సినిమా ఆగస్టు 19వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరందరూ క్యాష్ షోలో సందడి చేశారు. ఇటీవల విడుదలైన క్యాష్ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.