శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేసిన ధన్ రాజ్… ఇక ఆ ఛానల్ కి గుడ్ బై చెప్పినట్టేనా?

బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ వెండితెరపై కూడా ఎన్నో సినిమాలలో నటించి సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈయన చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఒకసారి ఈటీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన తిరిగి ఈటీవీ కార్యక్రమాలలో పాల్గొనలేదు.

ఇకపోతే ధనరాజ్ బుజ్జి ఇలా రా అనే సినిమాలో హీరో పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ధనరాజ్ ఈ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మీకు పవన్ కళ్యాణ్ తెలుసా అంటూ అడగడంతో వెంటనే ఒక్కసారిగా ఈయన ఫోన్ తీసి హలో అనగానే ఈ ప్రోమో కట్ చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ధనరాజ్ సందడి చేయడంతో స్టార్ మాతో ఈయనకు ఏదైనా విభేదాలు వచ్చాయా అందుకే స్టార్ మా కు స్వస్తి చెప్పి ఈ టీవీలోకి తిరిగి వచ్చారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కోసమే ఈటీవీలో సందడి చేయడానికి వచ్చారని భావిస్తున్నారు.మరి ఇదొక ఎపిసోడ్లోనే ఈయన కొనసాగుతారా లేదంటే పూర్తిగా ఈ టీవీ కార్యక్రమాలలో సందడి చేయనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.