స్టార్ హీరోతో డేటింగ్ కి వెళ్ళాలని మెసేజ్ పెట్టిన దివి… అతని రియాక్షన్ ఎంటో తెలుసా..?

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి బెగ్ బాస్ రియాల్టీ షో వల్ల మంచి గుర్తింపు పొందిన దివి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన కూడా సినిమాని మలుపు తిప్పే కీలక పాత్రలో నటించడం వల్ల మంచి గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీవి టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో డేటింగ్ కి వెళ్లే ఛాన్స్ వస్తే ఎవరితో వెళ్తావు అని అడగ్గా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన ప్రైవేట్ జట్టు డేటింగ్ కి వెళ్తానని ఆసక్తికర సమాధానం చెప్పింది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ షూటింగ్ సమయంలో చిరంజీవి తనని దగ్గరకు పిలిచి వేడి వేడి పునుగులు తినిపించినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చిరంజీవి ఇతరుల పట్ల వ్యవహరించే తీరు తనకెంతో ఇష్టమని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ చిరంజీవిని పొగడ్తలతో ముంచేసింది.

ఇక ప్రభాస్ గురించి అడగ్గా.. ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రభాస్ అంటే తనకి ఎంతో ఇష్టమని.. ఎంటెక్ చదువుతున్న రోజుల్లో ఇంస్టాగ్రామ్ ద్వారా “డేట్ కి వెళ్దామా “అంటూ ప్రభాస్ కి మెసేజ్ కూడా చేశానని దివి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ నుండి ఎటువంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఇక సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ గుర్తింపు పొందిన దివి భవిష్యత్తులో హీరోయిన్ గా కూడా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.