యాంకర్‌గా చేసిన ప్లేస్‌లో గెస్ట్‌గా.. భానుశ్రీ బాగానే హర్టైనట్టుంది!!

బొమ్మ అదిరింది షో ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్‌తో షోను ఎక్కడికో తీసుకెళ్లారు. జగన్ అభిమానులందరూ ఈ షోను వైరల్ చేశారు. అయితే ఈ వివాదంలో చివరకు హరి, రియాజ్ వంటి వారంతా క్షమాపణలు చెప్పారు. మొత్తానికి షో అయితే బాగానే క్లిక్ అయింది. అదంతా కాసేపు పక్కన బెడితే అందులో జరిగిన మార్పులు చేర్పులు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Comedian Venu ABout Bhanu Sri In Bomma Adirindhi
Comedian Venu ABout Bhanu Sri In Bomma Adirindhi

యాంకర్లుగా ఉన్న రవి, భాను శ్రీలను తీసేశారు. వారికి బధులుగా శ్రీముఖిని పట్టుకొచ్చారు. షో కూడా బాగానే రన్ అవుతోంది. కానీ భాను శ్రీ మనసులో మాత్రం ఏదో వెలితి ఉన్నట్టు కనిపిస్తోంది. మళ్లీ బొమ్మ అదిరింది షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వాలనే కోరిక బలంగా ఉన్నట్టుంది. అందుకే దసరా ఈవెంట్‌లో అందరి ముందు తన కోరికను బయట పెట్టేసింది. అది అంతా స్క్రిప్ట్ ప్రకారం నడిచినా కూడా భాను శ్రీ మనసులో కూడా అదే ఉన్నట్టుంది.

అయితే వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్‌లో బాను శ్రీ గెస్ట్‌గా రాబోతోన్నట్టు తెలుస్తోంది. వేణు ధన్ రాజ్ స్కిట్‌లోభాను శ్రీ ఎంట్రీ ఇచ్చింది. గత నాలుగు ఎపిసోడ్‌లుగా అడుగుతూ ఉంటే రావడం లేదట. కానీ ఈ స్కిట్ శ్రీముఖి సీట్, యాంకరింగ్ మీద అని చెప్పడంతోనే వచ్చిందట. అవును మరి ఎలా వస్తుందిలే. యాంకరింగ్ చేసిన చోట గెస్ట్ పర్ఫామెన్స్ అంటే పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం లాంటిది.

https://www.youtube.com/watch?v=KR8u-qn8wF0&feature=youtu.be