బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఒకటి. జబర్దస్త్ కార్యక్రమాన్ని మల్లెమాలవారు గత 10 సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా వంటి తదితరులు న్యాయాన్ని నిర్ణయితలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకున్నారు.
ఈ విధంగా నాగబాబు వెళ్లిపోవడంతో ఆయన స్థానంలోకి ఒక పర్మినెంట్ జడ్జి రాకుండా తరచూ ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే రోజా యదా విధిగా ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగారు. అయితే ఆమెకు కూడా మంత్రి పదవి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. రోజా వెళ్లడంతో ఆమె స్థానాన్ని పర్మినెంట్ గా ఇంద్రజ ఆక్రమించుకున్నారు.నాగబాబు స్థానం మాత్రం ఇప్పటివరకు పర్మినెంట్ కాలేదని తరచూ ఎవరో ఒకరు ఆ స్థానంలో వచ్చి వెళ్లే వాళ్లు.ఈ క్రమంలోనే మల్లెమాలవారు జబర్దస్త్ కి పర్మినెంట్ జడ్జి కావాలని ఆలోచించి ఈ కార్యక్రమానికి టాప్ కమెడియన్ కృష్ణ భగవాన్ ను పర్మినెంట్ జడ్జిగా కొనసాగిస్తున్నారు.
తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో కృష్ణ భగవాన్ జడ్జి స్థానంలో సందడి చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈయన జడ్జిగా వచ్చి రాగానే ఇంద్రజ పై దారుణమైన కామెంట్స్ చేస్తూ తనపై సెటైర్స్ వేశారు. ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ స్కిట్ చేస్తున్న అనంతరం ఇంద్రజ జడ్జిమెంట్ ఇచ్చారు.అనంతరం కృష్ణ భగవాన్ ఈ స్కిట్ గురించి మాట్లాడుతూ తాగుబోతు రమేష్ చేసిన స్కిట్ కన్నా ఇంద్రజ చెప్పిన జడ్జిమెంట్ చాలా పెద్దగా ఉందంటూ ఇంద్రజ జడ్జిమెంట్ పై సెటైర్ వేశారు. మొత్తానికి ఇది చూసిన ప్రేక్షకులు చాలా రోజులకి జబర్దస్త్ కార్యక్రమానికి సరైన జడ్జి వచ్చారని భావిస్తున్నారు.