మెగా ఫ్యామిలీతో అలీకి ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవితో ఉన్న బంధంతో అప్పట్లో ఇంటకి వెళ్లేవాడట. అలీ చైల్డ్ ఆర్టిస్ట్ కావడంతో చిన్నతనం నుంచి సెలెబ్రిటీల మధ్య ఉంటుండేవాడు. అలా చెన్నైలో ఉన్న కాలంలో టాలీవుడ్ ప్రముఖులందరి ఇంట్లో అలీ కుటుంబ సభ్యుడిగానే ఉండేవాడు. అందుకే ఎస్పీ బాలు కుటుంబం, మెగా ఫ్యామిలీ ఇలా చాలా మందితో అలీకి సత్సంబంధాలున్నాయి.
మామూలుగానే చిరంజీవి విదేశాలకు వెళ్తే అక్కడ దొరికే వస్తువులను, వెరైటీ బొమ్మలను పిల్లలందరి కోసం తెచ్చేవాడన్న సంగతి తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ కోసం తెచ్చిన బొమ్మలను ఇప్పటికీ దాచుకున్నాడట. అది వేరే విషయం అనుకోండి. అయితే అలా ఓ సారి సింగపూర్‌కు వెళ్లినప్పుడు చిరంజీవి ఓ కీబోర్డ్ తెచ్చాడు. దాన్ని నాగబాబు ప్రత్యేకంగా వాయించేవాడట. ఓ సారి అలా ఇంటికి వెళ్తే నాగబాబు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడట.
బొమ్మ అదిరింది షోలో ఈ మేరకు అలీ చెబుతూ.. ఓ సారి నాగబాబు అన్న దగ్గరికి వెళ్లాను. నాగబాబు చిరంజీవి గారు తెచ్చిన కీ బోర్డ్‌ను స్టైల్‌గా వాయించాడు. ఇదెప్పుడు నేర్చుకున్నావ్ అని అడిగాను. చిన్నప్పటి నుంచి అని చెప్పాడు. ఇంకోటి వింటావా? అని నాగబాబు అడిగాడు. ఓ బటన్ నొక్కాడు.. అలా మ్యూజిక్ వస్తుంది.. చేతులు మాత్రం ఇష్టమొచ్చినట్టుగా కదిలిస్తున్నాడు.. అప్పుడు నాకు అర్థమైంది. ఇదేదో కాట్రవల్లీ అని అలీ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=cQZ5DA5aiYY&t=7s