మునుపటి సీజన్లతో పోల్చితే నిర్వాహకులను నిరాశ పరుస్తున్న బిగ్ బాస్ రేటింగ్స్..?

దేశంలో అతిపెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రారంభమై ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రారంభమై మూడు వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ సీజన్ 6 లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పటికే గడిచిన రెండు వారాలలో ఇద్దరు కంటెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా.. ఇక మూడవ వారంలో కూడా మరొక కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కానుంది.

ఇక ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలావరకు ప్రేక్షకులకు పరిచయం లేని వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆరవ సీజన్ ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకు కూడా కంటెస్టెంట్లు తమ ఆటతో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ ఆరవ సీజన్ రేటింగ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మునపటి ఐదు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ రేటింగ్స్ చాలా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం వారు షో రేటింగ్స్ పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరికి షో లో జరిగే విషయాల గురించి అరియాన ద్వారా లీక్స్ ఇస్తున్నప్పటికీ షో రేటింగ్స్ మాత్రం పెరగలేదు.

ఇలా రోజురోజుకీ రేటింగ్స్ పడిపోవటంతో బిగ్ బాస్ యాజమాన్యం వారు తలలు పట్టుకుంటున్నారు. షో రేటింగ్స్ పెట్టడం కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ అవటం లేదు. అయితే ఆరవ సీజన్ కి సంబంధించిన రేటింగ్స్ ఇలాగే కొనసాగితే మాత్రం ఇక భవిష్యత్తులో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో ని ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి చూపరు. ఈ రేటింగ్స్ ప్రభావం ముందు ముందు ప్రసారమయ్యే సీజన్ల మీద పడే ప్రభావం ఉంటుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలని బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు మా టీవీ వారు కూడా చాలా ప్రయత్నం చెస్తున్నారు. వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయో? లేదో? చూడాలి మరి.