బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ ఓటింగ్.. చివరి స్ధానంలో నిలిచిన ఆ ఇద్దరు కంటెస్టెంట్లు?

ఎన్నో సంవత్సరాలుగా తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రారంభించారు. ఈ సీజన్ 6 మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా గడిచిన ఆరువారాలలో 6 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక తాజాగా కొనసాగుతూ ఏడవ వారంకి సంబంధించిన నామినేషన్ కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లకు కంటెస్టెంట్ లో చేస్తున్న పర్ఫార్మెన్స్ వల్ల రోజు రోజుకి ఓటింగ్ స్థానాలు తారుమారు అవుతున్నాయి.

ఈ ఏడవ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో పాల్గొన్న కంటెస్టెంట్లు ఆట మీద ఏకాగ్రత లేకుండా మాటలతో యుద్ధాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు శారీరక దాడికి కూడా దిగటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులలో కంటెస్టెంట్ లు వ్యవహరించే తీరు ప్రేక్షకులు కూడా అసంతృప్తి చెందుతున్నారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ ఓట్లు కూడా తారుమారో అయినట్లు తెలుస్తోంది. ఈ వారంలో మొత్తం 13 మంది కంటెస్టెంట్ లో ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

ఈ వారంలో గురువారం ఎపిసోడ్ లో ఓటింగ్ విషయంలో తారుమారు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడవ వారం గురువారం ఎపిసోడ్ కి సంబంధించి ఎప్పటిలాగే రేవంత్ శ్రీహన్ అత్యధిక ఓటింగ్ తో మొదటి రెండు స్థానాల్లో నిలిచాడు. గత వారం తన ఆటతీరుతో తక్కువ ఓటింగ్ సొంతం చేసుకున్నారు. బలాదిత్య, ఫైమా, ఆది రెడ్డి టాప్5 కంటెస్టెంట్లుగా నిలువగా..ఇక తక్కువ ఓటింగ్ తో మెరీనా మరియు శ్రీ సత్య 12, 13 స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకు కంటెస్టెంట్లు నమోదు చేసుకున్న ఓటింగ్ ఆధారంగా ఈ వారంలో శ్రీ సత్య , మెరీనా ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.