8వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లనున్న కంటెస్టెంట్ అతనేనా?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమం ఏడువారాలను పూర్తి చేసుకుని మరొక రోజుతో ఎనిమిదవ వారం కూడా పూర్తికానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా మరొక కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ హౌస్ వీడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బిగ్ బాస్ ఎనిమిదవ వారానికి సంబంధించిన నామినేషన్స్ లో భాగంగా హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లు కూడా నామినేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున ఆత్రుత ఏర్పడింది.

ఇకపోతే సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగగా శుక్రవారం వరకు కంటెస్టెంట్లు ఆట తీరును బట్టి వారికి ఓటింగ్ ఉంటుంది. అయితే ఈ ఓటింగ్ పూర్తి అయ్యేలోపు డేంజర్ పొజిషన్ లో ఆర్జే సూర్య ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనే విషయం శనివారమే సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటుంది ఇలా ప్రతివారం సోషల్ మీడియాలో వచ్చిన వారే ఆదివారం ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి ఆర్ జె సూర్య బయటకు వెళ్తున్నట్టు సమాచారం.

మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఆర్జేగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య ఈవారం బయటకు వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ వీరికి సంబంధించిన ఏవి లను కూడా సిద్ధం చేసి పెట్టారని ఆదివారం ఎపిసోడ్లో భాగంగా సూర్య బయటకు రానున్నారని తెలుస్తోంది.ఇకపోతే సూర్య మొదట్లో ఆరోహితో కాస్త చనువుగా ఉన్నారు. కానీ ఆరోహి బయటకు వెళ్లడంతో ఇద్దరు మంచి స్నేహితులని చెప్పారు. ఇక ఆరోహి వెళ్లడంతో ఈయన ఇనయ సుల్తానాకు దగ్గరయ్యారు.ఇనయ కూడా ఆర్జె సూర్యతో తనకు కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. మరి సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం ఈ వారం సూర్యనే బయటకు వెళ్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.