వరుణ్ సందేశ్ కు తనకు మధ్య వచ్చిన గొడవల గురించి క్లారిటీ ఇచ్చిన వితికా షేరు!

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో పాపులర్ అయిన వరుణ్ సందేశ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అతనికి తెలుగు సినిమా పరిశ్రమలో లవర్ బాయ్ గా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే అతను చేసిన సినిమాలన్నీ దాదాపుగా ప్రతి దానిలో ప్రేమను విభిన్న కోణాల్లో చూపించి అందరినీ అలరించాడు.

వరుణ్ ఒక సినిమాలో తన హీరోయిన్ గా వితిక ను ఎంచుకుని సినిమాను చేశాడు. అయితే అది విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దాని వల్ల ఈ ఇద్దరు ఒకటవ్వడం జరిగింది. ఆగష్టు 19వ తేదీన 2016వ సంవత్సరంలో తను వితిక షేరు అనే హీరోయిన్ ను వివాహం చేసుకున్నాడు. అలా ఈ జంట క్యూట్ కపుల్స్ గా నిలిచారు.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో వితిక.. వరుణ్ సందేశ్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. ముందుగా అతను అందరికీ ఒక లవర్ బాయ్ గా తెలుసు అని చెప్పింది. కానీ అతను ఎవ్వరితో ఎక్కువ మాట్లాడడని సెట్లో ఖాళీగా ఉంటాడని చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళ ప్రేమ.. అనేది షూటింగ్ కోసమని మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ చిగురించిందని చెప్పింది. వరుణ్ ముందుగా ఆమెకు ప్రపోజ్ చేశాడని తెలియజేసింది.

వితిక తమ పెళ్లి గురించి చెప్పుకుంటూ ఆమె ఇలా అవును! మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు వేడుకతో పాటు గురువారం రాత్రి రిసెప్షన్‌తో కలిపి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వివాహం చేసుకోవడానికి ముందు 2 రోజుల పాటు ఘనంగా జరిగిందని చెప్పింది. ఇక తాను వరుణ్ ఇద్దరూ తెల్లటి దుస్తులు ధరించి ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయడంతో సంగీత్ చక్కదనంతో సాగింది. అంగరంగ వైభవంగా జరిగిందని అందరికీ తెలిపింది.

ఇక వరుణ్ సందేశ్, వితిక షేరు జంటగా బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్నారు. బిగ్ బాస్ మూడో సీజన్‌లో వరుణ్, వితికలకు వ్యక్తిగతంగా ఆడే అవకాశం వచ్చింది. వాళ్లిద్దరూ 13 వారాల పాటు బిగ్ బాస్ హౌసులో ఉన్నారు. బిగ్ బాస్ హౌసులో సీక్రెట్ టాస్క్ భాగంలోనే వాళ్లిద్దరూ గొడవ పడింది బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. దీనికి స్పందించిన వితిక అది టాస్క్ లోని భాగమే నని తెలిపింది. అయితే చివరకు వాళ్లిద్దరూ టాప్ 7 వరకు వచ్చి టైటిల్ ను గెలుచుకోలేక పోయారు.

వరుణ్ సందేశ్ తెలుగు సినిమాలకు ఇప్పుడు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా అవకాశాలు రాక ఇప్పుడు అతను ప్రస్తుతం కెరీర్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వితిక కూడా పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుని తన పెళ్లి జీవితాన్ని గడుపుతుంది.