పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ…? వరుడు ఎవరో తెలుసా?

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినా ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని నటీనటులుగా, యాంకర్లుగా మంచి గుర్తింపు పొందారు. అయితే మరికొంతమంది సినిమా సీరియల్స్ ఆర్టిస్టులు కూడా బిగ్ బస్ లో పాల్గొనడం వల్ల వారి పాపులారిటీ మరింత పెరిగింది. ఆ కోవకు చెందినది యాంకర్ భాను శ్రీ. బుల్లితెర యాంకర్ గా, నటిగా గుర్తింపు పొందిన భాను పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాకుండా సినిమాలలో కూడా నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా అడపాదడపా అవకాశాలతో గుర్తింపు పొందిన భాను బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత భాను పాపులారిటీ మరింత పెరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత భానుకి అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలో ఈ అమ్మడు సినిమాలలో అవకాశాలు పొందటమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో సందడి చేసింది. భాను వాయిస్ కొంచెం హార్ష్ గా ఉండటం వల్ల తాను మాట్లాడే మాటలను అందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు. తన వాయిస్ వల్ల కూడా భానుకి ఒకరకంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం భాను ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు టీవీ షోస్ లో పాల్గొంటూ బిజీగా ఉంది అంతే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే తన అందమైన ఫోటోలు వీడియోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల భాను గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. నటిగా యాంకర్ గా గుర్తింపు పొందిన భాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో భాను తన క్లోజ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతోందని సమాచారం. ఇండస్ట్రీలో భాను ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడింది. అయితే భాను జీవితంలో కష్టసుఖాలలో పాలుపంచుకొని ఆమెకు అండగా నిలబడిన తన స్నేహితుడిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం గురించి భాను ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే భాను స్పందించాల్సి ఉంటుంది