Bigg Boss 5 Telugu: అనుకున్నది ఒకటి, అయినది ఒకటి.. కాజల్ ఎలిమినేట్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు అనేమాట వాస్తవం అని పలు సందర్భాల్లో బిగ్ బాస్ తెలిసేటట్లు చేసాడు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో ఇచ్చిన ట్విస్ట్ అండ్ టర్న్స్ మరే సీజన్ లో ఇవ్వలేదు అని అనడం లో సందేహమే లేదు. ప్రేక్షకుల అంచనాలని తలక్రిందులు చేసే షాకింగ్ ఎలిమినేషన్లు ఎన్నో జరిగాయి బిగ్ బాస్ హౌస్ లో. అలాంటి ఎలిమినేషన్ ఈ ఆదివారం కూడా జరగనున్నది.

ఈ వారం నామినేషన్స్ లో శ్రీరామ చంద్ర మినహాయించి మిగతా హౌస్ మేట్స్ షన్ను, సిరి, కాజల్, సన్నీ, మానస్ లు ఉన్నారు. శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే పొందుకుని ఫైనల్ లో నిలిచిన మొదటి కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సిరి హన్మంతు ఎలిమినేషన్ గండాన్ని తప్పించుకుని టాప్ 5 నిలిచిందని వినికిడి.

ఒకవైపు సన్నీ, మరోవైపు షన్ను ఇద్దరు ఓటింగు ప్రక్రియలో టాప్ రేసులో దూసుకుపోగా .. తర్వాతి స్థానంలో మానస్ నిలిచాడు. ఆఖరి స్థానాల్లో సిరి, కాజల్ ఉండగా.. వీరిద్దరి లో నుండి కాజల్ ఎలిమినేట్ అయినట్టు లీక్ బయటకి వచ్చింది. అధికారక ప్రకటన వచ్చే వరకూ బిగ్ బాస్ హౌస్ ను ఎవరు వీడుతారన్నది సస్పెన్సే . కాబట్టి.. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలుసుకోవాలంటే మరికొద్దిసేపట్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సండే ఫండే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.